ఓం శివాయ, గురవే నమః! కార్తిక మాసము!"శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 👌శ్రీ శివార్చన కొరకు
     శ్రేష్ఠమగు భక్తులకు
     "కార్తిక"మను మాసము!
              శంకర ప్రియు లార!
      ( శంకర ప్రియ పదాలు., )
👌చాంద్రమానం ప్రకారం, "కార్తిక మాసము".. ఎనిమిదవది! శరదృతువులో.. రెండవది! మహిమాన్విత మైనది.. కార్తికము!
👌"న కార్తిక సమో మాసః" యనెడు పురాణోక్తి ప్రకారం, మాసములలో.. "కార్తిక మాసము"నకు సమాన మైనది లేదు!  ఇది.. భక్త మహాశయు లందరికి అనంతమైన పుణ్య ఫలమును అనుగ్రహించు చున్నది. 
👌ఈ మాసమున, పూర్ణిమ నాడు.. "కృత్తిక" నక్షత్రము  కలిగి యుండడం వలన; దీనికి "కార్తిక" మని పేరు వచ్చింది! ఇది సాధకులకు బహుళ మైన ప్రయోజనముల నొసంగునది. కనుక "బహులా" అని, మరొక పేరు! ఇది.. సాంబ శివునకు ప్రీతి పాత్రమైనది. హర ఓం!
          🔱ప్రార్ధనా పద్య రత్నము
          ( కంద పద్యము)
       నీవే తల్లివి, తండ్రివి,
       నీవే మా తోడు నీడ, నీవే సఖుడవౌ!
       నీవే గురుడవు, దైవము,
        నీవే మా పతివి, గతివి, నిక్కముగ శివా!
       
       (.. శ్రీ శివ శతకము, పూర్వ కవి విరచితము., )
            ఓం నమః శివాయ! ఓం నమో భగవతే రుద్రాయ!

కామెంట్‌లు