చైతన్యమే జ్యోతి!"శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 👌అంతటా నెలకొన్న 
     చైతన్యమే జ్యోతి!
      అది అఖండ జ్యోతి!
              శంకర ప్రియులార!
      (శంకర ప్రియ పదాలు., )
👌"జ్యోతి" అనగా దీపము!  ప్రకాశించు నది.. జ్యోతి! అది.. సచ్చిదానంద మయమగు పరం బ్రహ్మము యొక్క స్వరూపము!
👌పరమేశ్వరుడే పరం జ్యోతి! స్వయం ప్రకాశమైనది. అది.. ఈ విశ్వ మంతటా నిండి నిబిడీ కృతమై యున్నది. సమస్త ప్రాణి కోటిలో.. "అంత ర్యామి"గా విలసిల్లు చున్నది. ఆ జీవాత్మ యే సాంబ సదా శివుడు!
          🔱ప్రార్ధనా పద్య రత్నము
          ( కంద పద్యము)
          వెలుగుల కెల్లను వెలుగయి,
         వెలుపల జగములు తెలియగ, వెలిగింతు వయా!
          ములుగని తొలి వెలుగువు! హరా!
          వెలుగుము నాలోన, నింపు వెలుగును శివా!!
       
       ( శ్రీ శివ కర్ణామృతం- మధుర కవి,  శ్రీ దేవులపల్లి చెంచు సుబ్బయ్య శర్మ., )
నమః శివాయ! ఓం నమో భగవతే,  రుద్రాయ.,

కామెంట్‌లు