ఈ దేవతలు ఆకాశమార్గాన తిరుగుతుంటారు అని ప్రజల నమ్మకం. ఈ జాతీయం 2 సంస్కృత శబ్దముల చే ఏర్పడిన సమాసము. తధా+ఆస్తు. అనుకున్నది అనుకున్నట్లు అన్నట్లు జరుగుగాక అని అర్థం. వీరు మానవుల కష్టసుఖాలను గమనించడానికి గగన విహారం చేస్తారు. ముఖ్యంగా వీరు ప్రొద్దుటి సంధ్యా సమయంలో సాయంకాలపు సంధ్యా సమయంలో వీరు గగనవిహారం చేస్తారు. వీరి వాహనం పవనం
తెల్లవారుజామున కానీ పొద్దు పోయే సమయంలో కానీ ఎవరైనా తీసుకున్న ఏదైనా అశుభము మాట్లాడిన ఎవరినైనా చెప్పించి మాట్లాడిన వారు తధాస్తు అంటారట. వారు అన్నట్లే జరుగుతుందని నమ్మకం అసలు ఈ దేవతలు ఉన్నారో లేదో కానీ పెద్దలు మాత్రం మానవుల ప్రవర్తన చక్కగా ఉండాలని ప్రచారంలోనికి తెచ్చారు.
వీరు ఉన్నారన్న భయానికి చెడ్డమాటలు మానాలని, పెద్దల కోరిక, పగలు రాత్రి హాయిగా గడవాలంటే గొడవలు పెట్టుకుని తిట్టుకో కుండా, శపించు కోకుండా ఉండాలని మన వారి కోరిక. కొందరు ఇది చేస్తాం అది చేస్తాం అని పోకిరి శబ్దాలు చేస్తే దేవతలు తధాస్తు అన్నారు అనుకో ఆ శబ్దం నెరవేరుతుంది ఈ దేవతలు అనుగ్రహ సమర్థులు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి