నా పల్లె అందాలు కనువిందుకు
కాశ్మీరం వలె వీనులవిందుకు
కూలీ నాలీలతో ఎంత అందంగా
ఉందో బాలబానుని జన్మ..
లెలెండి అందరు కోడికూసింది కలికి రెమ్మలు కళ్ళాపు జల్లి ఆకాశాన ఉన్న నక్షత్రాలవలె మిలమిల మెరుస్తున్న ముత్యాల ముగ్గులు చూడముచ్చటగా ధరణీ మాతపై వెదజల్లుతున్నారు.
ఆ కొండ చాటున ఉన్న సూరీడు ఆకాశమనే తల్లీ కోకను రుధిరంతో తడిపి ఎర్రని అందగాడివలె ఎంత అందంగా ఉన్నాడో...
ఆ దినకరునికి స్వాగతంపలకడానికి ప్రకృతమ్మ
కోకిలమ్మ కూజితాలతో ఆలపిస్తూ, పక్షులు కిలకిలారావాలతో తాళమేస్తూ, కొంగలు బారులుగా పరిగెడుతూ, అమ్మను అభినందించడానికి బయలుదేరుతూ స్వాతి ముత్యాలలాగా వెలుగుతున్నాయి..
తూర్పు తెలవారుచు చీకటిని పాలద్రోలుతూ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి