బాల కృష్ణం వందే సమ్మోహనం ;-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
విహితమ్ సుందర తేజం 
చరితం విస్మయ కథనమ్ 
మహితమ్ మానుష రూపం 
కృష్ణమ్ వందే సమ్మోహనమ్!

దేవకి మృదుమయ గర్భమ్ 
దినదిన ప్రవర్ధ మానం 
దుర్భర నిశీధి జననమ్ 
కృష్ణమ్ వందే సమ్మోహనమ్!

వర్షిత మేఘన కుంభమ్
హర్షిత యమునా తీరం 
వాసుదేవాయ పయనమ్ 
కృష్ణమ్ వందే సమ్మోహనo !

యశోద కర్మల భాగ్యమ్ 
వ్రేపల్లె స్థిరం శోభం 
గోపాల బాల సేవనమ్ 
కృష్ణo వందే సమ్మోహనం!!

గిరిధారి గోపి రక్షణమ్ 
 దురిత కాళీయ మర్ధనం 
రాసలీలా తరంగ నాట్యం
కృష్ణo మురళీ మోహనం !!


కామెంట్‌లు