సైనికులు ఆట వెలదులు ;-ఎం. వి. ఉమాదేవి.
దేశభక్తి జూపి దేవుని దూతగన్ 
పౌరరక్షజేయు పౌరుషమున 
సైనికులకు మొక్కు సైయని జైకొట్టు 
పరమ వీరచక్ర పరంజ్యోతి!

తిండి నీరులేక తెగువజూపుచునుండు 
జన్మభూమి కొరకు జయముగోరు 
కన్నవారు గాని కట్టుకొన్నదిగాని 
దీక్ష సడల నీరు దివ్య మతులు!!


కామెంట్‌లు