త్రినయని ...ఆ బాల కళాకారిణి…;-*ఎ.రజాహుస్సేన్.
 *చిత్రలేఖనం..నృత్యం, గాత్రం ఆ బాల కళా కారిణికి 
 మూడు కళ్ళు…!!
*చదువులో కూడా  సరస్వతి...ఈ 'చిరంజీవి 'యశస్వి' !!
*హనుమాన్ జంక్షన్ బాల చిత్రకారిణి, క్లాసికల్ డ్యాన్సర్,
సింగర్ ..."యశస్వి అనుమోతు" ...…."(Child Artist ,
Classical dancer singer rubbic cube sloveing artist...Yasaswi Anumotu…..From Hunuman Junction, Andhra Pradesh, India.)
ప్రస్తుతం ఆ బాలిక వయసు 14 యేళ్ళు..చిత్రలేఖనంలో 
ఇప్పుడిప్పుడే తన ఉనికిని చాటుకుంటోంది. నిజానికి 
పన్నెండేళ్ళప్పుడే యశస్వి బొమ్మలు వేయడం ప్రారంభిం
చింది.తమ బిడ్డ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఓ
ఆర్ట్ టీచర్ ( Mahesh sellar ) ను  పెట్టి చిత్రలేఖనంలో తర్ఫీదు ఇప్పిస్తున్నారు.యశస్వి శ్రీ చైతన్య స్కూల్లో 
9వ తరగతి చదువుతోంది.చదువులో కూడా సరస్వతే..!
బేటీ బచావో..భేటీ బడావోతో పాటు  బేటీకో సిఖావో..
అంటూ .. యశస్వి తల్లిదండ్రులు.   శ్రీమతి మాధవి,
ఎ.వి.ఎస్.ఆర్ కుమార్ (Madhavi. a.v.s.r kumar)
అందిస్తున్న ప్రోత్సాహం  అభినందనీయం..!!
*కళా సరస్వతి…!!
కేవలం చిత్రకళ మాత్రమే గాక ఈ చిన్నారి యశస్వి ….
క్లాసికల్ డాన్సర్ కూడా...అంతే కాదు చక్కని గాత్రం.
కమ్మగా పాడుతుంది..చిత్రలేఖనంలో కూడా తనదైన
ముద్ర వేసుకుంటోంది.!!
*హనుమాన్ జంక్షన్' బాల చిత్రకారిణి, క్లాసికల్ డ్యాన్సర్,
సింగర్ .." యశస్వి అనుమోతు " కు అభినందనలు..!!
చిత్రం.. మొహమ్మద్ గౌస్.
*ఎ.రజాహుస్సేన్.
(A.Raja Hussain)
Hyderabad . India.

కామెంట్‌లు