మన భాష.;-తాటి కోల పద్మావతి గుంటూరు.

 మనది తెలుగు భాష. ఇది అజంతం. అంటే అచ్చులతో అంతమయ్యే పదాలు గల భాష. అచ్చు నే స్వర మని, ప్రాణమని అంటాం. అజంతా నికి గల మాధుర్యం, జీవం హాలంతానికి ఉండదు. అక్షరాలపొంకాని బట్టి ఇ చూస్తే మనది అజంతా శిల్ప సుందరి భాష అనవచ్చు. దీని లిపిలో ఎన్నో వయ్యారాలు కనిపిస్తాయి. అంచేత తెలుగు వినటానికి చూడడానికి మనడానికి చాలా అందంగా ఉంటుందని అర్థం.
తిలలు అనగా నువ్వులు. అవి ఎక్కువగా పండే ప్రాంతంలో మాట్లాడే భాష తెలుగు అని అంటారు. తెలుగు మాటకు పర్యాయం తెనుగు. ఇది ఇది తేనె అగు భాష తెనుగు. అనే అర్థంలో రూడీ అయ్యింది. ఈ మాటే మాధుర్యాన్ని తెలుపుతూ ఉంది. ఇక ఆంధ్ర శబ్దాన్ని అందరి చేత ధరింప తగింది. అని కొందరు చమత్కరించారు. ఇతర భాషల పదాలను మన తెలుగు సులువుగా తనలో కలుపుకుంటుంది. సంస్కృత భాష పాలలో చక్కెరలాగా తెలుగు లో కలిసి పోయింది. లలితంగా చెప్పడానికి తెలుగు, గాంభీర్యం సాధించడానికి సంస్కృతం అవసరం. ఈ కల పోతా తెలుగు భాషకు ఎంతో ఉదాత్తతను సంతరించి ఉంది.
కామెంట్‌లు