జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు ;-తాటి కోల పద్మావతి గుంటూరు.
 స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు దాటిన సందర్భంగా ఆ దేశ భక్తి నాయకులను ఒకసారి స్మరించుకుందాం.
జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్వాతంత్ర స్వేచ్ఛావాయువులు మననం చేసుకుందాం.
---------------------------------------------------------
కవిత శీర్షిక స్మరించుకుందాం.
ఇంకా ఆశగానే ఉంది.
కళ్ళకి కనిపిస్తున్న సమరయోధుల సంగ్రామంలో పూరించిన శాంతి చాలు.
రాట్నం వాడికి న చేతులు
ఏ ఆయుధాలు లేని విప్లవకారులు.
ఆక్రమించే కోరికకు దాసోహం అయితే వేట కత్తులు మర ఫిరంగుల విధ్వంసానికి నేలంతా రక్తాభిషేకం తో తడిసిపోయింది.
ప్రాణం కంటే స్వాతంత్రం ముఖ్యమని గెలిచినా ఓడినా
భరతమాత దాస్య శృంఖలాలు చాలని ఎందరో నాయకులు ఉద్యమ పోరాటం సాగుతూనే ఉన్నది.
దేశభక్తి చాటుకున్న ఎందరో అమరవీరుల నరనరాల్లో
దేశభక్తి నింపుకొన్న నవభారత నిర్మాతలు ప్రాణాలర్పించిన అమరవీరులు.
తుపాకీ గుండుకు గుండె లేదు రెడ్డి నా టంగుటూరి.
మొలక ప్రాయం నుండి మహా వృక్ష మై ఆంధ్ర ఉద్యమాన్ని శ్రద్ధాసక్తులతో సంతరించిన వ్యక్తి
వెంకటప్పయ్య గారు.
ప్రకాశం పట్టాభి, అల్లూరి , ఆజాద్, ప్రకాశం వంటి హృదయాలు భరత జాతిని ఏకధాటిగా నడిపిస్తూ
ఎందరెందరో ధన ప్రాణాలను పణంగా పెట్టి దేశభక్తిని చాటుకున్నారు.
తెలుగువారి ఇ మహోజ్వల చరిత్ర
జాతీయ భావాలను
ప్రేరేపించినా తిలక్
విప్లవ చైతన్యాన్ని రగిలించడానికి పత్రికలు మహా రచయితలు తెలుగువారు విశ్వ దాతలు దేశభక్తులు ప్రభంజనమై కదిలారు  .
జాతీయ కాంగ్రెస్ కు సంఘ అధ్యక్షులుగా కొండ అత్తయ్య గారిని పొగడిన మహాత్ములు ఉద్యమం కోసం అనేక మంది యువకులు సత్యాగ్రహం చేసి కారాగార శిక్ష అనుభవించారు.
గాంధీ గారి నాయకత్వంలో వేలాది మంది జైలుకు వెళ్లారు .
కులతత్వం, మతాభిమానం పరమత ద్వేషం
జాతి సమైక్యతను కూకటివేళ్లతో పెకలించి మానవజాతి పురోగమనానికి గొడ్డలిపెట్టు నిలిచి దేశం కోసం దేశభక్తి ఎందరో అమరవీరుల ను స్మరించుకుందాం.

కామెంట్‌లు