పద్యాలు ; - సాయి రమణి
 1. కల్పనా చాతుర్య కావ్య వైభవంబు
భూతలంబు నందున కాంతి గోళమై
ప్రజ్వరిల్లె అపూర్వ మణి శోభ భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!
2. కవన కిరణ కాంతుల శోభ
త్రిభువనంబు నందు శాంతి బోధ
గావించె ప్రణవ మంత్రపు దివ్య భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!
3. సుమధుర రమణీయ యమున నది
ప్రవాహా తరంగ సవ్వడుల వలె
అనంత అక్షర సంపద కల్గిన భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

కామెంట్‌లు