కచ్చేరి పైన పద్యాలు;-మచ్చ అనురాధతెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.
గొడవ గలిగెనేని కుదురుగా కచ్చేరి
చేరి బాధనంత చెప్పుకొనగ
పల్లె లందు కలుగు పంచాయతీలన్ని
పెద్దరికము జూపి బుద్ధి చెప్పు .

ఉర్వి జనులు వెళ్ళి నూరి పెద్దకు జెప్ప
వినియు గొడవనంత  విశదముగను
కలిసి ఉంటె మనకు కలుగు శుభమనియు 
తీర్పునిచ్చు నమ్మి మార్పు కొరకు .

పొద్దునంత పనులు పొట్టకూటి కొరకు
చేసి యలసిపోయి చేరి యడ్డ 
మాటలాడి కొంత మనసు మోదమునొంద
యింటి దారి బట్టు యింపుగాను .


కామెంట్‌లు