అతివలచే అలరించిన
దివిటీలు. . .
అంతరంగంలో వికసించిన.
అనురాగ గీతిక కావాలి!
తైలంతో జ్వలించే జ్యోతి,
కాలం పరిమితం...!
స్నేహ తైలంతో ప్రజ్వరిల్లే
జీవన జ్యోతి కాలం
అపరిమితం!
విధిగా నిధితో జరుపుకునే
దీపావళి విలాసం ఒక్కరొజే!
అంధకార హ్రృదయాలను
ఆప్యాయత, అనురాగం తో వెలిగిస్తే. .
ప్రతిరోజూ దీపావళే!
అందుకె.......
మనస్సును ఆవరించిన
తమస్సు నుఛేదించె
జ్ఞానజ్యోతివెలిగినాడె
అదినిజమైన దీపావళి......!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి