పల్లెటూరు అందాలు బాల గేయం ;-ఎం. వి. ఉమాదేవి
భలే భలే మా పల్లె 
బాటలుంటాయి 
బాట పక్క వరిచేలు 
బోలెడు ఉంటాయి !

పొడుగాటి తాటిచెట్లు 
పొగరు గుంటాయి 
చెరుకుతోట అందాలు 
చక్కగుంటాయి !

ఆకుకూర గోంగూర 
మడులు ఉంటాయి 
వంగ బెండ చిక్కుళ్ళు 
కూర లుంటాయి !

అక్కడక్కడా పాకలు 
ఇళ్ళుంటాయి 
కోళ్లు మేకలు కలిసి 
తిరుగు తుంటాయి!

మైదానంలో మేసే 
గేదెలు ఉంటాయి 
అక్కడోటీ ఇక్కడోటీ 
ఆవులుంటాయి !


కామెంట్‌లు