శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారి జయంతిని పురస్కరించుకుని 'సేవ' సాహితీ సంస్థ వారు "సేవ సాహితీ సప్తాహం" పేరిట నిర్వహించిన తెలుగు భాషా వారోత్సవాలలో వచన కవితల విభాగంలో పాల్గొని
"సార్ధకత" అనే వచనకవిత చదివిన సందర్భంగా కవయిత్రి ఉమామహేశ్వరి యాళ్ళ గారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. దాదాపు ఇరవై దేశాలు నుండి వెయ్యి మంది కవులు /కవయిత్రులు 23-08-2021 నుండి 29-08-2021 వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి పన్నెండుగంటల వరకు జరిగిన జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. ఇందరు కవులు ఒకే వేదికపైకి వచ్చి వారం రోజులపాటు కవితా వారోత్సవాల్లో పాల్గొనడం ఒక అపురూప ఘట్టంగా చెప్పవచ్చు. ఆ సందర్భంగానే తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన ధృవీకరణ పత్రమును సెప్టెంబరు ఐదు న పంపడమే కాకుండా నేడు(13-11-2021) ఉమామహేశ్వరి యాళ్ళకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ సర్టిఫికేట్ను అందజేసారు. ఈ సందర్భంగా ఆమె ఎంతో ఆనందాన్ని వెలిబుచ్చారు. గతంలో సప్తవర్ణ కవన మంజరికి గానూ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ను సొంతం చేసుకోవడం, నేడు ఈవిధంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందడం పూర్వజన్మ సుకృతమంటూ తన తల్లిదండ్రలకూ, సోదరులకూ , విద్యాబుద్ధులు నేర్పిన గురువులకూ ధన్యవాదములు తెలుపుకున్నారు.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన విశాఖ ఎలయన్స్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు ఉమామహేశ్వరి యాళ్ళ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి