గీతాంజలి; -రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 7.నిరాడంబరత
సరళ , నిరాడంబరతలతో నా జీవితాన్ని ధన్యత పరచుకోనివ్వు ప్రభూ ....
నాపాట ఒంపు సొంపులను వదిలి పెట్టింది. అలంకారాదులను చూచి ఆ పాట గర్వపడదు కూడ. పైగా అలంకారాలు మనమధ్య ఐక్యతకు ఆటంకాలౌతావి. నువ్వు చెప్పే రహస్యపు మాటలు నా చెవిన స్పష్టంగా పడకుండా వాటి ధ్వనులు ఆటంకాలౌతుంటవి. నీ ఎదుట నాకవిత్వ అహంకారం మాయమౌతుంది. నేను నీ పాదాల దగ్గరే కూర్చుని వున్నాను. నీ పాటతో సరళ నిరాడంబరతలతో ధన్యత చెందే పిల్లన గ్రోవి లాగే సరళ నిరాడంబరతలతో నాజీవితాన్ని కూడ ధన్యత పరచుకోనివ్వు ప్రభూ.....

కామెంట్‌లు