"బాలసాహిత్య రత్న " పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం






 పెద్దకడబూరు మండలంలోని, హిస్సారమురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయునిగా పనిచేస్తున్న, ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త గద్వాల సోమన్నను 'బాలసాహిత్య రత్న  పురస్కారం వరించింది.  తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో వీరి విశిష్ట సేవలకు గుర్తింపుగా "తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సాహిత్య అకాడమీ వారి సౌజన్యంతో,భానుపురి సాహితీ వేదిక సూర్యాపేట వారి ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య హాల్,సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ లో జరిగిన సాహితీ పురస్కారాలు-2021 ప్రధానోత్సవ కార్యక్రమంలో గౌ.డా.జస్టిస్ సి.చంద్రయ్య ఛైర్మన్  తెలంగాణ మానవ హక్కుల కమిషన్,గౌ.మామిడి హరికృష్ణ సంచాలకులు,తె. రా భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి తెలంగాణ సాహిత్య అకాడమీ,గౌ.డా.ఏనుగు నరసింహారెడ్డి అదనపు కలెక్టర్,మేడ్చల్,గౌ.కళారత్న బిక్కి కృష్ణ కవి, సీనియర్  జర్నలిస్ట్ మరియు అతిరథమహారధుల చేతుల మీదగా "బాలసాహిత్య రత్న "అవార్డుఅందుకున్నారు.బాలసాహిత్యంలో  పలు పుస్తకాలు వ్రాసి,ముద్రించడమే కాకుండా,బాలలచే రచనలు చేయిస్తూ, 'పసి(డి) హృదయాలు ' బాలసాహిత్య వేదికను ఏర్పాటు చేసి తెలుగు భాషాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్నారు.ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న ఖాతాలో మరొక అవార్డు జమ కావడం విశేషం. అవార్డు గ్రహీత గద్వాల సోమన్నను భానుపురి సాహితీ వేదిక అధ్యక్షులు డా.రామడుగు రాంబాబు, ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీనివాస్,కోశాధికారి పోతుగంటి వీరాచారి,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరూ అభినందించారు.
కామెంట్‌లు