చంద్రకళ. దీకొండ * కు *తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్* లో చోటు
 శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా
*సేవా సాహితీ సంస్థ* వారు
*సేవా సాహితీ సప్తాహం* పేరిట నిర్వహించిన తెలుగు భాషా వారోత్సవాల్లో
*జంధ్యాల సాహితీ వేదిక* ద్వారా పాల్గొన్నందుకు కవయిత్రి మరియు ఉపాధ్యాయిని
*శ్రీమతి చంద్రకళ. దీకొండ * గారికి
*తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్* లో  చోటు దక్కింది.
దాదాపు 20 దేశాల నుండి 1000 మంది కవులు 23-8-2021 నుండి 29-8-2021 వరకు జరిగిన మెగా గ్లోబల్ వర్చ్యువల్ కవితా సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది.
ఇంతమంది తెలుగు కవులు ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల పాటు కవితా వారోత్సవాల్లో పాల్గొనడం ఒక అపురూప ఘట్టం.
అందుకుగాను కవి సమ్మేళనంలో పాల్గొన్న శ్రీమతి చంద్రకళ. దీకొండ గారి పేరు *తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్* లో  నమోదు చేస్తూ,ప్రశంసాపత్రమును నిర్వాహకులు అంతర్జాలం ద్వారా అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు తన సాహితీమిత్రులతో,
సహోద్యోగులతో  ఆనందాన్ని పంచుకున్నారు.
****************************************


కామెంట్‌లు