. రంగులతో ఆనందము -సంధ్యారాణి.వి- కలం స్నేఖం
మగువ చేత నిలిచి 
మన్నికయ్యి మెరిసి 
ఉషస్సుతో ముంగిట 
ముద్దుగా మెరిసెను. 

కంటిలో నిలిచిపోయి 
వచ్చిపోయే వారికి  
చూడాలని పిస్తూ 
వాకిలిలో అందాన్ని 
చిందిస్తూ నిలిచెను. 

రంగులతో రమ్యమై 
పండగతో అందమై 
పేరంటాలు పిలిచిన 
అతివ రూపు నిలిచెను. 

నవవసంతాల నందనమై 
ధరణిలో మెరుపులా 
జనజీవని నివాసము 
ఆహ్లదము నిలిపెను. 

అంతరంగ మందున 
అతివ చేతి నిలిచే 
సంధ్య దీప్తి మెరుపులా
హృదయమే పంచే 

నిత్య సంతోషాన్ని 
కలిగిస్తూ చిత్త రూపు 
లయ్యి అందరిలో 
ఆనందము గొలిపెను.


కామెంట్‌లు