సునంద భాషితం;- *సునంద వురిమళ్ల ఖమ్మం*
 *ఆత్మీయత*
*******************
 *ఆత్మీయత అనేది ప్రేమానురాగాల కలబోత మమతానుబంధాల విరిపూత..*
*పంచుతుంటే ప్రాణ దీపమై  వెలుగులీనుతుంది*
*పెంచుకుంటే  అనుబంధం తామర తంపరై వృద్ధి చెందుతుంది..*
*ఆత్మీయత అజాత శత్రువు. అందరికీ ప్రియమవుతుంది.*
*అందుకే చిటికెడు ఆత్మీయత కోసం అర్రులు చాచే వారెందరో...*
*సుప్రభాత కిరణాల నమస్సులతో🙏*

కామెంట్‌లు