లఘు కవిత
భస్మోద్ధూళిత దేహము...
ఆయనో ప్రకృతి స్వరూపం
కొండా కోనల్లో తిరిగే నిత్య తాపసి!
అందుకే మూగ జీవులూ మెచ్చి
జట్టు కట్టేశాయి...
గుహాలయాల గుట్టు తెలిసిన
సాలీడాయన చుట్టూ మురిపెం గూడు అల్లుకుంది..
కాలం విలువ తెలిసిన కాళమొకటి పూలు పత్రితో
కలిసి అలుముకుంది !
స్వేచ్ఛగా వనవిహారి కరిరాజు
పుంజీడు నీళ్ళు తెచ్చి అభిషేకించి...
కదళీ ఫలాలు ప్రియమార పెట్టి
శివయ్య నావాడేనని కూచుని
తొండం ఊపి...
ఎన్నెన్ని ముగ్ధ భక్తులు కదా ఇవన్నీ
శివయ్యా...?
తమ భక్తి నిరూపణ కోసమే
గోడుగోడున విలపించి నిన్నుచేరినవి!
శ్రీ కాళ హస్తి ఆలయం సువర్ణముఖీ నదీమతల్లి తీరాన...
భవ్యము, దివ్యము, భక్తి కావ్యము!!
భస్మోద్ధూళిత దేహము...
ఆయనో ప్రకృతి స్వరూపం
కొండా కోనల్లో తిరిగే నిత్య తాపసి!
అందుకే మూగ జీవులూ మెచ్చి
జట్టు కట్టేశాయి...
గుహాలయాల గుట్టు తెలిసిన
సాలీడాయన చుట్టూ మురిపెం గూడు అల్లుకుంది..
కాలం విలువ తెలిసిన కాళమొకటి పూలు పత్రితో
కలిసి అలుముకుంది !
స్వేచ్ఛగా వనవిహారి కరిరాజు
పుంజీడు నీళ్ళు తెచ్చి అభిషేకించి...
కదళీ ఫలాలు ప్రియమార పెట్టి
శివయ్య నావాడేనని కూచుని
తొండం ఊపి...
ఎన్నెన్ని ముగ్ధ భక్తులు కదా ఇవన్నీ
శివయ్యా...?
తమ భక్తి నిరూపణ కోసమే
గోడుగోడున విలపించి నిన్నుచేరినవి!
శ్రీ కాళ హస్తి ఆలయం సువర్ణముఖీ నదీమతల్లి తీరాన...
భవ్యము, దివ్యము, భక్తి కావ్యము!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి