అజీర్తి తగ్గడానికి కరి వేపాకు పొడి...;-పి . కమలాకర్ రావు

 కరివేపాకులను తెచ్చి ఉప్పు పసుపు వేసి బాగా కడిగి ఆరబెట్టాలి. ఆతరువాత ఆకులను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
కొన్ని ఎండు మిరపకాయలు, మిరియాలు, ధనియాలు, జిలకర,
వెల్లుల్లి పాయలు, అన్నీటిని కలిపి వేయించుకోవాలి. చివరగా తగినంత ఉప్పు కలిపి  వేయించిన కరివేపాకులతోపాటుగా మిక్సీ పట్టాలి. ఎంతో కమ్మ ని  కరివేపాకుపోడి తయారయింది.
ప్రతి రోజు భోజనములో మొదటి ముద్ద నెయ్యి వేసుకొని తినాలి.
ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది.
అజీర్తిని పోగొడుతుంది. పొట్టకు బలాన్నిస్తుంది.  I.B.S (Irritable Bowel Syndrome ) అనబడే 
పొట్ట సమస్య తగ్గి పోతుంది.
ఇది చక్కెర వ్యాధి రాకుండా కాపాడుతుంది.
కామెంట్‌లు