కలం స్నేహం;-రాధా కుసుమ
పల్లవి..
M
మల్లెపొద పిలుస్తుంది రావే పోదాం చిన్ని
గుట్టుగా గుసగుసలు సన్నాయి రాగం తీయాలే...
F
చాల్లే పోరా కురుస్తుంది అలజడి వర్షం
రాలేను పోరా బంగారం...
చాటుగా సరసాల వేణుగానం
వినలేనురా...

చరణం
నీ కనులు కలువలే
సొంపులు వంపులే
అజంతా శిల్పాలే 
కావాలి నాకంకితం ఇవ్వాలే...
పగడాల దీవి సరసాల గంగా ప్రవాహం కావాలే...
//వయ్యారాల చిన్నే//
పల్లవి
//మల్లె పొద పిలుస్తుంది//

చరణం
నీ చూపులే మన్మధ బాణాలు
పల్లకి బోయనై పరువాలే మోస్తానే....
నయాగారా జలపాతం కురిపిస్తా నీపైనే...
వన్నెల వైడూర్యం నమ్మే నన్నే...
నా తోడు నీవుంటె పగలే వెన్నెలే...
చెంత లేకుంటె అమావాస్య నిశీధి రాత్రులే...
కొత్తగా ఉందిలే ప్రేమ నదిలో మునగడం...
ఈతనే నేర్చుకుంటూ పైపైకి తేలడం....
వయ్యారాల చిన్నె
//మల్లె పొద పిలుస్తుంది//

చరణం
శిలని  మార్చిన శిల్పివి నీవేలే
చిరునవ్వుల ముగ్గులు 
కౌగిట్లో ముద్దులు
లంచంగా నేనిస్తాలే...
అందాల ఆరబోతలు
మందారాల జలకాలు
ఇకపై అన్నీ నీవేలే
అంతగా నచ్చావురా
మనసైన చంద్రుడా
//చిత్రాల చిన్నవాడా//
మల్లె పొద పిలుస్తుందా 
రారా పోదాం కన్నా
గుట్టుగా గుసగుసల సన్నాయి రాగం తీద్దామురా చిన్నా...!

కామెంట్‌లు
Savithri ravi desai చెప్పారు…
చాలా బాగుంది
Savithri ravi desai చెప్పారు…
చాలా బాగుంది
Savithri ravi desai చెప్పారు…
చాలా బాగుంది
Savithri ravi desai చెప్పారు…
బావుంది అక్క