బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;-సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 176) పరిపూర్ణ మనోనిగ్రహం లభించనిదే ఏమి చేసినా అడవికాచిన వెన్నెల మాదిరిగా నిష్ప్రయోజనం.
177) యుద్ధం అభివృద్ధి సూచన అని భావించడం పిచ్చితనం.
178) నీ మోక్షం కోసం నువ్వు పాకులాడితే నరకమే నీకు గతి. ఆత్మ సామ్రాజ్యం పొందగోరితే స్వీయ మోక్ష వాంఛను విడనాడు.అదే మహోత్తమ సాధన.
179) స్వీయమోక్షాన్ని కోరి స్వర్గాన్ని పొందడం కంటే పరశ్రేయానికై ప్రయత్నించి నరకానికి వెళ్ళడమే మేలు.
180) కర్మనిష్ఠులకు ఇనుపకండలతో, ఉక్కునరాలతో కూడిన దృఢశరీరం కావాలి.కాబట్టి బిడ్డలారా! శరీరబలాన్ని సముపార్జించండి.
(సశేషము)
కామెంట్‌లు