ఓ వాసంత సమీరం;-బి.హరిరమణ-కలంరత్న
జీవ ప్రవాహిని గా
మూగబోయిన అనురాగం
జలదులై    ముంచెత్తేదిప్పుడో

 అర్థం కాని గజిబిజి గడిచిన జీవితకాలపు అట్టడుగు మాళిగలలో సేకరించిన అలజడులను
 పైకి తీయాలి  ఏ పాతాళ గరిగతో 

వృద్ధి గవాక్షాల లో వెన్నెల 
 నింప దెందుకో ప్రశాంతతను
లేవు ఎందుకని మనసారా పలకరింపుల మహోత్సవాలు

నమ్మకం నిర్లక్ష్యపుటిరుసులలో
 పడి పైకి రానంటుంది
 ఎప్పుడో విరగబూసిన మల్లె తీగ
 ఈనాడు ఎందుకు నిలిచింది మోడుగా

జీవితంలో వెల్లివిరిసే హరివిల్లులు నీ మోముపై 
 పూోయించాలి చిరునవ్వులు

గాంభీర్యము ముసుగును వదిలించుకుని
ప్రకృతి పరవశించి ప్రకృతి పరవశాలు మదినిండా నింపుకో

బ్రతుకును నవ్వుల నావపై పయనింప చేసే ఆశల దర్పణాల లో
 రేపటి జీవితాన్ని చూడు
అదిగో ఓ వాసంత సమీరం
అల్లనల్లన నిన్నే పలకరిస్తోంది...


కామెంట్‌లు