సంస్కృతి సాంప్రదాయం;-రాధ కుసుమ-కలం స్నేహం
ఈ విశాల గగనంలో
అద్భుత దృశ్యం
అనంత సౌభాగ్యం
ఆ సేతు హిమాచల
గంగానది పుణ్య ప్రవాహ నీడలో 
వెలసిన మన సంస్కృతి సాంప్రదాయం
విశిష్ట సృష్టి లయకారం...!

ఐకమత్యపు రాగానందమై
భిన్నమతాల 
సమ్మేళనమై
ఒకరికొకరికి తోడుగా నీడగా
వివిధ భాషా విరుల పరిమళాలతో 
అలరారే అందమైన నా భారతదేశం...!

చినుకుల సవ్వడులు
మదిలో ఉత్సాహ ఊపిరులై
వాగులై వంకలై సెలయేరులై 
నదులై కడలిలో చేరి
ఆవిరి రూపంలో
మేఘమాలలై 
మన అవని అంతరంగానికి చేరే
ఈ ఆనందం ఎంత సుందరం
అది వీక్షించే మనం ఎంత అదృష్టవంతులం...!

సత్యధర్మం శాంతి అహింసలు మన రక్తంలో పొంగె
నీతి సూత్రాలై
పుట్టుకతోనే వచ్చే సుగుణం
ఈ ధరిత్రి లో జన్మించిన వారికది సొంతం...!

యువతలో దాగిన సృజనాత్మకతకు పదును పెట్టి
సాగాలి భవిష్యత్తు కు
పునాది రాళ్ళౌతూ
అదే భారతీయ వారసత్వ సంపదౌతూ...!


కామెంట్‌లు