1) ప్రమిదలన్ని పెట్టి పడతులు మురియుచు
ప్రమిద చుట్టు నిలిచి పాట పాడి
ప్రమిదకాంతిగనుచు పడతుల నగవులు
ప్రమద! వెలుగునందు పరుగులిడుము
2) చిచ్చుబుడ్ల వెలుగు చీకటి చీల్చును
కాకరొత్తులాట కలిమి పెంచు
తాళ్ళు,పెన్సిలంటు తాంబాలమున చక్రి
దివ్య వెలుగులింట తేజమిచ్చు
3). ఉల్లిగడ్డ బాంబు నురికురికియు పెట్టి
లక్ష్మి, తోక కాల్చి లక్కుయనిరి
తుస్సుమంటు బాంబు బుస్సున పేలును
చూసి కాల్చగలరు జోరుగాను
4) పూర్ణిడబ్బ తీసి పొట్టి రాయిని పట్టి
కొట్టుకుంటు వణుకు కుర్రకారు
బొమ్మ పిస్తలట్టి బుడతలు ముదమున
సందులన్ని చుట్టి చిందులెసిరి
5). దుబ్బతుత్తురట్టి దొబ్బుగా చుట్టుచు
గ్యాసు నూనె పోసి కాల్చి తన్ని
ఆడునపుడు పొగ యవనియంతయు నిండి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి