*విజయకేతనము*;- మిట్టపల్లి పరశురాములు
ఓటువిలువగెలిచింది
ఓటుధీటునిలిచింది
దగాకోరులందరినిల
పట్టిపరుగుపెట్టినది

రాజకీయమెనాటకము
రమ్యమగురంగస్థలము
మారుచుండుపాత్రధారి
మార్చివేయునుగవేషము

మోసాలనరికట్టినరు
వేషాలనెదిరించినరు
అవనీతిపరులనుబట్టి
అంతరింపజేసినారు

ఓటువజ్రాయుధమైనది
నోటుబట్టిచింపినాది
మత్తుమందుపారబోసి
నీతిబాటనిలిచినాది

కామెంట్‌లు