జైభీమ్ ....>సినీమా సమీక్ష--డా.మల్లేశ్వరి.చుండూరి >భీమవరం..ప.గో.జి
ఈ మద్య చూసిన సినిమల్లో 
బాగామనసుకు హత్తుకున్న సినిమా 'జై భీం '
కన్ను ఆర్పితే ఏమి మిస్ అవుతానో అని
ఉత్కంఠగా చూసాను .
నా చిన్న తనం లో నవెల్స్ చదువుతూ 
చుట్టూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకునే దాన్ని .

ఈ డైరెక్టర్ కుడా మనచుట్టూ 
ఒక ఆరా సృష్టించాడు 
పాత్రల్లో మమేకమై ఆ భాదను అనుభవిచేటట్లు 
అందులొ ఉన్న పాత్రలు జీవించాయి .

ఎంత బలమయిన వ్యక్తిత్వాలూ!
చావు దెబ్బల తింటూ కుడా "దొంగ' 
అనే  ముద్ర వేయించుకోలేనుఅనే పాత్ర .
చదువు లేదు భర్త హత్యకు గురి అయ్యాడు కడుపులో ఉన్న బిడ్డ కళ్ళముందు
మరో  బిడ్డ ఆధారం లేదు.
అయిన సరే కేస్ వాపస్ తీసుకుంటె జీవితానికి సరిపడ డబ్బు ఇస్తాను అంటే .....
ఆ డబ్బు తో బ్రతుకుతూ నా బిడ్డలకి "మీ నాన్నను చంపిన వాళ్ళ డబ్బుతో బ్రతుకుతున్నాం "అని నెను చెప్పలేను,అ నే మాట ఎన్నొ అర్థాలు చెప్పింది 'నమ్మిన దాన్ని ఆచరించటానికి 'ఆస్తి '
చదువు అధికారం అండ అక్కరలేదు అని !

ఈ సినిమా నాణానికి రెండువైపులా చూపించింది 
ఒక అవినీతి పోలిస్ (దొ0గసొమ్ము తనే తిని ) అమాయకుడిని లాక్ అప్ డెత్ చెయ్యటం 

మరో పోలిస్ ఆఫిసర్ నిజాతిగా తన 
తోటి పోలీసుల 
అకృత్యాలని బయట పెట్టడం 
ఒక లాయర్ తనకు రాజకియ పదవికోసం
నిజం తెలిసినా తప్పుని ఒప్పులా వాదించడం 

మరో లాయరు (సూర్య) ఒక్క రూపాయికూడా
 ఇచ్చుకోలేని కేసు గురించి  కష్టపడటం 
ఒక డాక్టరు తప్పుడు సాక్ష్యం చెప్పడం 
మరో డాక్టరు ఉన్నది ఉన్నట్లు చెప్పడం 

సినిమా అయిపోయాక ఆ సినిమాలో ఉన్న 
పెయిన్ రాత్రంతా వదలక పొవటం 

అస్సలు అలాంటి బలమైన వ్యక్తిత్వాలు 
ఉన్న మనుషులు నిజంగా ఉంటారా అనిపించడం 
అస్సలు సినిమాలొ సూర్య ఎక్కడా కనిపించలేదు 
జై భీం ఒక ఆస్కార్ విన్నింగ్ సినిమా అనిపించింది 


కామెంట్‌లు