పరీక్ష! అచ్యుతుని రాజ్యశ్రీ


 పౌరాణిక చారిత్రక కాలంలో కూడా రాకుమారుడి రాజకుమారి కధలు వారి ప్రేమ పెళ్లి గాధలు మనం చదువుతున్నా ము.కానీ వారు పెద్దల అనుమతి లేకుండా పెళ్ళి చేసుకోలేదు.ఈవిషయం నేటి వారు గమనించాలి. తమ మనసులో ని మాటని స్పష్టంగా పెద్దలకి చెప్పేవారు. దేశరక్షణ కోసం తమ ప్రేమను కూడా త్యాగం చేశారు. 

అలాంటి చారిత్రక జంట ఈకధ నాయికా నాయకులు ఇందుమతి చంద్రశేఖరుడు.ఇబ్రహీం లోడీ దండయాత్రలు కుట్రలు కుతంత్రాలతో భారత దేశం అల్లకల్లోలంగా ఉన్న రోజులవి.మనప్రాంతీయరాజుల అనైక్యత దురహంకారంవల్ల చిన్న చిన్న రాజ్యాలు దెబ్బతిని  దేశభక్తులు మట్టిలో మాణిక్యం గా ఉండిపోయారు. 

అలాంటి పరిస్థితిలో వింధ్యాచల అడవుల్లో తల్లి లేని పిల్ల తన ఏకైక కుమార్తె  ఇందుమతి తో కాలం గడుపుతున్నాడు ఆవృద్ధుడు!తండ్రి తప్ప వేరే నరమానవుని చూసి ఎరగదుఆ16ఏళ్ల పిల్ల! ఒక రోజు 20-22ఏళ్ళ చంద్రశేఖరుని అడవిలో దారితప్పిన వాడిని తమకుటీరంకి తీసుకుని వచ్చింది ఆమె.ఆమె తండ్రి అతనిని  నోటికొచ్చినట్లు తిడ్తాడు "ఏంరా!అభంశుభం తెలీని నాకూతుర్ని మాయమాటలతో బోల్తాకొట్టించి సరాసరి నా ఇంటికే కన్నంవేస్తావా?" "స్వామీ! నేను నిర్దోషిని.ప్రాణరక్షణకై పరుగులు దీస్తూ ఈకీకారణ్యంలో చిక్కు కుపోయాను.అలసట తో శోషవచ్చి పడి పోయిన నన్ను  ఈవనదేవత కాపాడింది"దీనంగా అన్నాడు. "అవును నాన్నా! అతను నిర్దోషి. నేనే బలవంతపెట్టి తెచ్చాను"  "సరే!పొద్దు పోయింది. రేపు తెల్లారుతూనే చెట్లు అన్నీ నీవు కొట్టేయాలి. ఇందుమతీ!ఇతనికి  కుళ్ళిపో యిన పళ్ళు ఫలాలు తాగటానికి మురికి నీరు మాత్రం ఇవ్వు."ఆవృద్ధుడు బైటికి వెళ్లాడు.తండ్రి మాటలు పెడచెవిన పెట్టి మానవత్వం తో ఆమె  మంచి ఫలాలు పాలు ఇచ్చి అతిథి సత్కారం చేస్తుంది.బైట కెళ్ళిన యోగివేషంలోఉన్న ఆమె తండ్రి  తమ కుటీరం సమీపించి ఒక్క సారి గా ఈలవేస్తాడు.అంతే!బిలబిలమంటూ కత్తులు డాళ్లు బాణాలతో ఓ పాతిక మంది దృఢకాయులు అతని ఎదురుగా  నించున్నారు. వారిని చూసి ఆయువతీయువకులు నిర్ఘాంత పోయారు. "వీరులారా! వీడు నాకు బానిస. పారిపోకుండా చూడండి. "అని చంద్రశేఖరునితో "కట్టెలు కొట్టాక అవన్నీ  కుటీరంలో పేర్చు.ఇందుమతి!అతనితో మాట్లాడితే నీతల నరికేస్తాను"అని హెచ్చరించాడు ఆబైరాగి తండ్రి. ఇలారెండురోజులు గడిచాయి. ఆ అర్ధరాత్రి ఆముసలిబైరాగి చెట్టు కింద దృఢకాయులైన అనుచరులతో మాట్లాడటంని  ఆయువతీయువకులు పొదలచాటున నక్కివిన్నారు."వీరులారా! దైవానుగ్రహం వల్ల అజయగఢ్ రాకుమారుడు చంద్రశేఖరుడు శత్రువు నించి తప్పించుకుని మన అటవీప్రాంతంలోకి వచ్చాడు.ఇతని తండ్రిని ఇబ్రహీంలోడీ కపటంతో చంపాడు. బాబర్ తో లోడీ కియుద్ధం జరిగినపుడు చంద్రశేఖరుడు మారువేషంలో లోడీ సైన్యంలో కి ప్రవేశించి అతన్ని చంపి  దారితప్పి మన స్థావరంలోకి ప్రవేశించాడు. నాకుమార్తె ఇందుమతి కి తగిన భర్త అతనే! నాకఠినపరీక్షలో ఇద్దరూ నెగ్గారు.తన నాల్గవ ఏటనే తల్లిని కోల్పోయిన నాపాపని అతనిచేతిలో పెట్టి నేను తృప్తి గా ప్రాణం విడుస్తాను..""చంద్రశేఖరా!నేను దేవగఢ్ పాలకుడిని.పాపి ఇబ్రహీం లోడీ నాభార్యనుకోరాడు.నాభార్య ఆత్మహత్య చేసుకుంది. నాకోటను యవనులు స్వాధీనం చేసుకున్నారు. నాచిన్నారి ఇందుతో బైరాగి వేషంలో  బతుకు తున్నాను. నమ్మకస్తులైన నా సర్దారులు నాకు పెట్టని కోట.నాయనా!నాబిడ్డ భారం ఇకనీదే"అని ఇందుమతి చేతిని చంద్రశేఖరుని చేతిలో పెట్టాడు.చుట్టూఉన్న సర్దారులు ఆనందంతో  జయజయధ్వానాలు చేశారు.

కామెంట్‌లు