బాలలము;- లతా శ్రీ
బాలలము మేము
ఆడే పాడే పిల్లలము

అల్లరిపనులతో అలరిస్తాం
చిలకతో పలుకులు పలుకుతాం
కోయిలతో రాగాలు తీస్తాం
అమ్మ ఒడిని బొమ్మలము మేము

జాతిపిత వారసులం
చాచా నెహ్రూ గులాబీలం
గురువుల ప్రియ శిష్యులం
నాన్న కంటి వెలుగులము మేము

మాటల మతాబులం
భారతమ్మ ఇంట
పాలు పెరుగు గువ్వలం
భావి భారత పౌరులం

కామెంట్‌లు
Balu Kayyuru చెప్పారు…
బాగుంది లత