మనసున్న మారాజు ;-ముంతాజ్ బేగం-కలం స్నేహం
కొందరంతే...
అత్యంత శక్తిసామర్ధ్యాలు, ప్రతిభా పాటవాలున్నా..
అల్లరిఅల్లరిగా పసితనాన్నివీడక సామాన్యులుగా సాగే అసామాన్యులు
ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ
ప్రతీ బంధాన్ని ఆలింగనము చేసుకొంటూ.. ప్రేమకై, బంధానికై 
ఏమిఇవ్వడానికైనా, ఏమి చెయ్యడానికైనా..
ఒక్కక్షణం కూడా ఆలోచించని
సమర్ధులు వారు!!

కోటికి ఒక్కరుగా పుడతారు
కోవెలలో దేవుని గుణాన్ని కలిగి వుంటారు 
ఒక్క తమకోసమే కాకుండా
అందరి కోసం.. అందరి
 వారీగా నడుస్తారు
అందుకే ఈ లోకంలో వారిదో
ప్రత్యేకమైన గుర్తింపు అందరిలో!!

ఆ కొందరిలో ఒక్కడు వాడు
దూకే జలపాతం వాడు
ఉల్లాసం ఉత్సాహలకు
ప్రేమ, అభిమానాలకు చిరునామా వాడు!!

కొంటెపనులతో కంటికి 
ఆకాతాయిలా కనిపిస్తూ 
నలుగురిలోకలిసి తిరుగుతున్న
దైవదూతంటి వాడు వాడు!!

 మమతానురాగాలతో నిండిన మాటలకు బందివాడు 
ఆపదవస్తే తన పరబేధాలు ఎరుగక..
తెగించి పరుగులు తీసి ప్రాణాలను కాపాడే 
 ఆపద్భాంధవుడు వాడు!!

జనం ఆశించే సమాజో ద్ధారకుడు వాడు
మానవత్వాన్ని మంటగలవనివ్వని 
మనసున్న మారాజు వాడు
అందుకే వాడుఅయినాను అందరి వాడు!!


కామెంట్‌లు