గీతాంజలి; రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 5. "జీవన గీతార్పణకై “అనుక్షణం భగవత్ స్వరూపాన్ని ఆరాధించగోరే భావన"......
నీవిక్కడనే ఒక్క నిమిషం కూర్చోవటానికి అనుమతిని చనువుగా అర్ధిస్తున్నాను, అనుక్షణం నీ రూపసౌందర్యా రాధనలోనే గడపలేకపోతే నా హృదయానికి శాంతిలేదు. నాకేమైనా పనులుంటే తరువాత చూసుకుంటాను. నా కార్యాచరణలన్నీ ఒడ్డుకు చేరటానికి దారి తెలియని సముద్రప్రయాణ శ్రమల్లా ఉన్నవి. వయోభార సమయం ఆసన్నమైంది. నీ మంగళరూపాన్ని చూస్తూ నీ కెదురుగా కూర్చొని నా జీవన గీతానికి ప్రశాంత విరామం కల్పిస్తూ దానిని నీకు అర్పణ చేయటానికి “ఇది తగిన సమయం"గా భావిస్తున్నాను.

కామెంట్‌లు