బాల మిత్రుల కథ; -సి. గాంధీ నారాయణ రిటైర్డ్ డి. ఎస్.పి . సైబరాబాద్
 మనోహర్ కు  అర్ధ రాత్రి 12:00 గ౦:లు  దాటిన నిద్ర పట్టడం లేదు , గడి గడికి గడియారం వంక చూస్తున్నాడు , అది ఎందుకో ఆగి, ఆగి నిదానంగా నడుస్తునట్లు , అపుడప్పుడు ఆగి పోయినట్లు అనిపిస్తుంది అతనికి, గడియారం పాడై పోయిందా? బ్యాటరీ అయిపోయిందా? అనుమానం ఎప్పుడు తెల్లరుతుందా! అని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు కాలం ముందుకు సాగటం లేదనిపిస్తుందతనికి ఎదలో ఏదో ఆందోళన అలజడి – తన మిత్రుడు బాలరాజు బెంగళూరు  ముల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చావు బ్రతుకులా మద్య కొట్టు మిట్టాడు తున్నాడు. అతన్ని చేరుకోవాలనే మనోవేధన, కాలం ఎలాగోలాగా ముందుకు సాగిపోతూ  తెల్లరింది . ఉదయం సుమారు 4:00 గ౦:లు  వేను వెంటనే లేచి గబ గబ తయారై బ్యాగు భుజం మీద వేసుకొని , తన ఫ్రెండ్ ను అడిగి తీసుకున్న బైక్ మీద అఫ్జల్ గంజ్ బస్ స్టాండ్ కు వెళ్ళి అక్కడ బైక్ ను పార్కింగ్ లో ఉంచి  అటునుండి బెంగుళూరుకు బస్సు మీద తన మిత్రుడు బలరాజును కలుసుకోవడానికి వెళ్లాలనేది తన ప్లాన్; ప్లాన్ ప్రకారం బైక్ మీద JNTU కూకటపల్లి హాస్టల్ నుండి బయలు దేరినాడు.      
బైక్ మీద బయలు దేరినాడు కానీ మనస్సు తన స్వాదినం లో లేదు ఏవేవో ఆలోచనలు బైక్ వేగం అంతకంతకూ పుంజు కుంటుంది మూసపేట్ కు రాగానే  ఎదురుగా ఒక లారీ ట్యాంకర్  ఎదురుగా అతివేగంగా వస్తూ  బైక్ ను డీ  కోట్టింది బైక్ తో  సహ మనోహర్ ఎగిరి కింద పడి  పోయినాడు  మనోహర్ తలకు బలమైన గాయమై సృహ తప్పి పడి  పోయి నాడు. అక్కడున్న కొంత మంది వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు పై సృహ తప్పి పడిపోయిన మనోహర్ ను పక్కకు జరిపి 108 ఆంబ్యులెన్స్ కి  ఫోన్ చేసి , దానిలో – అపోలో  హాస్పిటల్ బంజారా హీల్స్ లో  చేర్చడం జరిగింది. మనోహర్ ను పరీక్షించిన డాక్టర్లు మెదడుకు బలమైన గాయము కావడం  వలన, రక్తం గడ్డ కట్టడం మూలాన కోమాలోకి వెళ్ళి నట్లు నిర్ధారించినారు .
@@@@@@@@
 మనోహర్ , బాలరాజు బాల్య స్నేహితులు 2 వ తరగతి నుండి ఒకే హై స్కూల్ లో చదువుతున్నారు , మనోహర్ ది  నిరుపేద కుటుంబం , బాలరాజు ది ఉన్నతమైన మోతు బరి  సంపన్న కుటుంబం మనోహర్ స్కూల్ లో  ఎప్పుడు ఫస్ట్ వచ్చే వాడు  బాలరాజు  వో మోస్తరుగా చదివేవాడు , కానీ మనోహర్ తో ఎప్పుడు పోటీ పడటానికి ప్రయత్నించే వాడు కాదు మనోహర్ కు మాత్రం తన స్నేహితుడు బాలరాజు తన లాగా బాగా చదివి మంచి మార్కులు సాదించాలని ఆశించేవాడు , అందుకని వారి ఇంటికి దాబాకు వెళ్ళి బలరాజుకు చదువు చెప్పే వాడు తన నోట్స్ ఇచ్చి కాపీ చేయమని చెప్పే వాడు.  5 వ తరగతి లో లెక్కల మాస్టర్          ‘’ అందరూ హోం వర్క్ చేసినారా ’’ అని   క్లాస్ లో అందరినీ అడిగి , చేయని వారిని లేచి నిలబడమని అడిగినాడు . క్లాస్ లో అందరూ లేచి నిలబడినారు , మనోహర్ కూడా లేచి నిలబడినాడు . మనోహర్ లేచి నిలబడడం చూసి మాస్టర్ ఆశ్చర్య పోయినాడు హోం వర్క్ క్లాస్ లో ఎవ్వరూ చేయక పోయినా – మనోహర్ చేసేవాడు అతనెప్పుడు లేచి నిలబడలేదు . 
మాస్టర్ మనోహర్ ను తప్ప అందరినీ కూర్చోమని చెప్పినాడు .  ‘’ మనోహర్ ని మీద నాకు ఎంతో నమ్మకం ఉంది నీవు నిలబడుతావని నేను అనుకోలేదు నా  ఆశలు వమ్ము చేస్తున్నావు, నీకు ఎంతో భవిష్యత్తు ఉంది దాన్ని పాడు చేసుకోకు ’’  అని చెప్పడం మొదలు  పెట్టినాడు .   ఏ౦ చెప్పిన మనోహర్ మౌనంగా ఉండి  పోయినాడు తనకు తెలుసు తను కంప్లీట్ చేసిన మ్యాత్స్ నోట్స్ తన మిత్రుడు బాలరాజు దగ్గర ఉంది పోయింది . బాలరాజు స్కూల్ కు నోట్ బుక్ తీసుకోస్తానని చెప్పినాడు కానీ ఆ రోజు ఎందుకో స్కూల్ కు రాలేక పోయినాడు . తనకు చెప్పకుండా స్కూల్ కి ఎప్పుడు గైర్హాజరు  కాలేదు . స్కూల్ విడిచిన వెంటనే ఇంటికి పోకుండా నేరుగా బలారాజు బంగ్లా కు వెళ్ళినాడు.  బంగ్లా కు చేరుకోగానే  నౌకరు ఒకరు  మనోహర్ ని లోపలికి తీసుకెళ్లినాడు . మంచము మీద బాలరాజు అనారోగ్యం తో ఉన్నాడు . ఏమైందని మనోహర్ తళ్ల డిల్లీ పోయినడు. ‘’ ఏమి లేదు ఏదో గుండెకు సంభంది౦చిన వ్యాది అంతా సర్దుకు పోతుంది లే ‘’ అని బాలరాజు తల్లి దండ్రులు సర్ది చెప్పినారు . మనోహర్ హృదయం కొంత శాంతించింది . అయినా బాలరాజు తో ‘’ బాలు నీవు స్కూల్ కు రాక  పోయినందుకు ఏమైందో అని నేను ఎంతో తళ్ల డిల్లి పోయాను , నీకు గుండె జబ్బు అని తెలిసి తట్టుకోలేక పోయాను ‘’ లేదు మనో ఇది చాలా చిన్న జబ్బే నివు బదపడేఅంత పెద్ద దెమి కాదు ;; అని సర్ది చెప్పినాడు.
వారిద్దరి మద్య స్నేహం అపురూపమైనది వారి అనోన్యమైన స్నేహం గురించి స్కూల్ లోనే కాదు ఊరంతా చర్చ జరిగేది ఆర్ధికంగా, సమాజికంగా  ఎంతో వ్యత్యాసం ఉన్న మానసికంగా వారు ఒక్కటైనారు.
పదో తరగతి పరీక్షలు గురించి మంచి మార్కులు రావాలని ఇద్దరు కష్టపడి చదివి పరీక్ష రాశారు  పదో తరగతి రిసల్ట్స్  వచ్చాయి ప్రతి సబ్జెక్ట్స్  లో నూ మనోహర్ కు మంచి మార్క్ లు వచ్చాయి అందరూ ఊహించి నట్లే  జిల్లా స్థాయిలో ఫస్ట్ వచ్చినాడు బాలూ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాడు . మనోహర్ స్నేహితుల౦దరితో కలిసి ఆనందం పంచుకున్నారు. బాలరాజు తన అమ్మమ్మ హైదరాబాద్ ఇంటి నుండి సెలవుల్లో హైదరాబాద్ కు  రావాలని పిలుపు వచ్చింది బాలరాజు , మనహోర్ కు చెప్పి సెలవుల్లో హైదరాబాద్ కి వెళ్ళి పోయాడు.
@@@@@@
మనోహర్ స్కూల్ లో ప్రతి విషయంలో కూడా అందరికంటే ముందు ఉండేవాడు పొద్దస్తమానం పుస్తకాలు ముందేసుకొని చదివే తత్వం కాదతనిది స్కూల్ లో మాస్టర్ చెప్పే పాఠ్యంశాలను శ్రద్ధగా వినేవాడు అప్పటికప్పుడే కంటస్తం చేసేవాడు మాస్టర్ అడిగిన ప్రతి ప్రశ్నలకు సమాధానం  చెప్పే వాడు ఏక సంతాగ్రహి అని పేరు తెచ్చుకున్నాడు  పగలంతా ఊర్లో ఉరేగేవాడు సాయంత్రం 6 గ౦:ల కే  ఇంటికి చేరుకొని రాత్రి 10 గ౦:ల వరకు చదువుకొని తిరిగి తెల్లవారు జమునా 4 గ౦:ల కు లేచి చదువుకునేవాడు స్కూల్ లో జరిగే ప్రతి కార్యక్రమానికి న్యాయకత్వం  వహించి , కార్యక్రమాన్ని ముందుండి నడిపించేవాడు స్కూల్ లో జరిగే ఆటల పోటీలు వాకృతపు పోటీలు, వ్యాసరచన పోటీలు, మొదలైన పోటీలలో కూడా ఫస్ట్ వచ్చేవాడు. స్కూల్ లో జరిగే సంస్కృతిక కార్యక్రమంలో కూడా ఆక్టివ్ గా పార్టీసిపేట్ చేసేవాడు మొత్తానికి స్కూల్ లో అల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు .  తనకంటే సీనియర్ తో వినయ౦గా ఉంటూ, తన తోటి వారితో కలుపు గోలుగా ఉంటూ, తన జూనియర్స్ అందరినీ పలకరించి అబిమానిచేవాడు మాస్టర్స్ కు కూడా మనోహర్ అంటే వల్ల మాలిన అభిమానం ఇద్దరు ముగ్గురు మాస్టర్లు ఉన్నచోట మనోహర్ ప్రస్తావన వచ్చేది.
    
ఒక్క స్కూల్ లో నే కాదు ఊర్లో కూడా మనోహర్ క మంచి పేరుంది ఊర్లో పోతూ పోతూ ప్రతి ఒక్కరినీ పేరు పేరు నా పలకరిచేవాడు . ‘’ ఏ౦ మల్లయ్య  భావ; ని గోర్లు బాగున్నాయా  ఆదివారం సంతకు పోయివచ్చావా ? నీ  కొడుకు బాగా చదువుతున్నాడా ?  ఏ౦ పాపమ్మక్క! చెర్లో నీళ్ళు వదిలినరా ? నీళ్ళు తక్కువైనవా! బట్టలు తెల్లగా కావడం లేదు . దొరోళ్ళు డబ్బులు ఇస్తున్నారా ! ఏ౦ కనకయ్య మావ! నీ  పందులు బాగా బలిసాయా  , నీ  పిల్లలను చదువుకోవడానికి బడికి పంపు, బాగా చదివించు. ఏ౦ ఎల్లన్న! నీ  కొడుకు ఆరోగ్యం ఎట్లుంది ? పట్నం తీసికెళ్లి పెద్ద డాక్టర్ కు చూవించు, అని ఊర్లో ఉన్నవారందరిని ఆప్యాయంగా పలకరి౦చేవాడు అడిగిన, అడగకపోయిన సలహాలు ఇస్తుండేవాడు, అందరికీ సహాయం అందించేవాడు అందుకే ఉరందరికి అతనంటే వల్ల మాలిన అభిమానం ఊర్లో వారందరికి తల్లో నాలుకలా ఉండేవాడు.
ఉరంతటికి ఒకే సేదురు  బావి ఉంది వారంతా ఆ బావి నుండే నీళ్ళు తాగడానికి తోడుకునేవారు అది చాలా లోతైనది సన్నగా ఇరుకుగా ఉంటుంది చిన్న పిల్లలు బాలు తో అడుతూ ఆడుతూ ఉండగా బాలు వెళ్ళి బావిలో పడింది బాలుకోసమై వెళ్ళిన పిల్లవాడు బావిలో తొంగి చూస్తూ జారీ బావిలో పడిపోయినాడు చాలా మంది  ఊరి జనం బావి దగ్గర జమ కుడినారు కానీ దిగడానికి ఎవ్యరికి ధైర్యం చాలడం లేదు మనోహర్ అటుగా వస్తు ఏమైంది చూసి ఏమాత్రం  ఆలోచించకుండా, సంకోచింపకుండా బావిలో దూకి ఆ బాలుని పైకి తీసినాడు , అది చూసిన జనం మనోహర్ ను గొప్పగా కొనియాడరు , అబినందించినరు అలా ఊరి జనంకు  మనోహర్ అంటే అబిమానం ఏర్పడింది.
@@@@@@@
బాలరాజు సెలవుల్లో హైదరాబాద్ (పట్నం ) లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అక్కడే వారం పది రోజులు ఉన్నాడు . ఇంటర్మీడియట్ పట్నం లో చదవమంటే మనోహర్ ను దృష్టి లో పెట్టుకొని టౌన్ లోనే చదువుతానని పట్టు  పట్టినాడు.
వారం రోజుల తర్వాత పట్నం నుండి వచ్చిన  బాలరాజుకు, మనోహర్ కనబడక పోవడం తో బాలరాజు  తళ్ల డిల్లీ పోయినాడు. ఎన్నడూ మనోహర్ ఇంటికీ  బాలరాజు వెళ్ళి ఉండ  లేదు . తప్పని పరిస్థితిలో మనోహర్ ఇంటికి వెళ్ళినాడు. అది ఒక చిన్న పూరీ గుడిసె – వెళ్ళగానే మనోహర్ తండ్రి వీరన్న కనిపించినాడు,  ‘’నయానా ! నా అవుసట్ ఉన్న౦త వరకు చదివించా , ఇక చదివించలేను ఏదైనా  పని చూసుకోమని చెప్పిన , ఎక్కడకు పోయినాడో  ? ఏమో పట్నం లో ఏదైనా పని చూసుకుంటానని పోయిండు,  ఏం పని దొరికిందో ఏమి చేస్తుండో పట్నం లో ఎక్కడున్నాడో తెలియదు’’ ఈ మాటలు వింటు౦డగానే           బాలరాజుకు కాలు నిలువలేదు, కాలు  క్రింద భూమి గుండ్రంగా తిరిగినటైంది వెంటనే ఇ౦ట్లో  తల్లి దండ్రులను ఒప్పించి హైదరాబాద్ పట్నం లో చదవడానికై వెంటనే పయనమైనాడు హైదరాబాద్ సిటి కాలేజీ లో  ఇంటర్మీడియట్ అడ్మిషన్ కై అప్లై చేసినాడు కానీ అంతటితో ఆగలేదు హైదరాబాద్ లో గల్లీ , గల్లీ తిరగడం మొదలు పెట్టినాడు మెకానిక్ వర్క్ షాపులు , కనబడిన ప్రతి ఆటొ ను, కంస్ట్రాక్షన్  లో ఉన్న బిల్డింగ్ దగ్గర, బార్ & రెస్టారెంట్స్  హోటేల్స్ సినిమా హల్స్ ఒక్కటేమిటి ప్రతి దగ్గర బస్స్టాండ్ల  దగ్గర , రైల్వే స్టేషన్ దగ్గర వెదకడం మొదలు పెట్టినాడు పట్నంలో (బ్రతుకుదామని)  బాల్య స్నేహితుని వెదకటానికై  బయలు దేరిన బాటసారికి ఎంత కస్ట౦?

బాలరాజు ఒక రాత్రి మనోహర్ గురించి వెతుకుతూ ఐమ్యాక్స్ సీని కాంప్లెక్స్ కు వచ్చి ఫస్ట్ షో సినిమా చూసి బయటకు వచ్చి ఆటొ కోసం ఎదురుచూస్తున్నాడు  ముందుకు ఒక ఆటొ వచ్చి ఆగింది . బంజారాహిల్ల్స్ రోడ్ నం:12 కు వెళ్ళమని ఆటొ వాలను పురమఇంచి ఆటొ లో కూర్చున్నాడు బాలరాజు మనసు మనసులో లేదు ఆలోచనంత తన మిత్రుడు మనోహర్ పైనే , సార్! బంజారాహిల్స్ రోడ్డు నెంబర్  12 వచ్చినాము , ఇక్కడనుండి ఎక్కడకు వెళ్లలో చేప్ప౦డి ? వెంటనే మనోహర్ ను బాలరాజు గుర్తు పట్టినాడు అతని నోట మాట రాలేదు . క్రిందికి దిగి మనోహర్ ను కౌగిలించుకున్నాడు ఇద్దరికీ కళ్ల నుండి నీరు ధారాళంగా ఉద్వేగం ఆపుకోలేక మౌనంగా కొంత సేపు ఉండి  పోయారు  ఇక చాలు ఇద్దరం కలిసే చదువుకుందాం నిన్ను నేను చూసుకుంటాను . చదువు కయ్యే ఖర్చంతా నేను భరిస్తాను ఇద్దరం కలసి సిటి కాలేజీ లో నే చదువుకుందాం , ఆ రోజూ రాత్రి ఇద్దరు వారి అమ్మమ్మ ఇంట్లోనే పడుకున్నారు.
మరుసటి రోజు ఇద్దరు కలసి సిటి కాలేజీ కి వెళ్ళినారు , మనోహర్ తో కూడా ఇంటర్మీడియట్ అడ్మిషన్ కై అప్లై చేయించినాడు రెండు స౦: ల ఇంటర్మీడియట్ చదువుతూనే సెలవుల్లో ఊరికి పోయి వచ్చేవారు . పట్నంలో చదువుతూనే ఊరి బాగోగులను గురించి పట్టించుకొనేవారు  మూత బడిన ఊరి గ్రందలయమును తెరిపించి నడిపించి దాన్ని ప్రభుత్వ స్వాదిన  పర్చినారు ఊర్లో కరువు కటకాలు వచ్చినపుడు వరదలు వచిన్నపుడు రోజుల తరబడి ఊర్లో ఉండి ఊరికి సేవలు అందించినారు  యువకుల౦దరిని పోగు చేసి రాత్రి బడులు ఏర్పాటు చేసి చదువు చెప్పేవారు . చూస్తుండగానే ఇంటర్మీడియట్ పూర్తి అయింది ఎంసెట్ ఎంట్రన్స్ ఎక్సామ్ ఇద్దరు వ్రాసినారు మనోహర్ కు ఎంట్రన్స్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది జె యన్ టి యు  , కూకట్పల్లి లో ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు , బాలరాజు కు మంచి ర్యాంక్ రాలేదు తన తండ్రి గారి , తాత గారి పలుకు బడితో  ఎన్‌ఆర్ఐ  కోటలో సి‌బి‌ఐటి లో సీట్ సంపాదించుకున్నాడు , మనోహర్ కు  జె యన్ టి యు  హాస్టల్ లో కూడా సీట్ వచ్చింది హాస్టల్ లో ఉంటూ చదువుతున్నాడు ఇద్దరి చదువులు కొనసాగుతున్నవి ఇంతలో ఒక రోజు రాత్రి బలరాజుకు ‘’ హార్ట్ ఎటాక్ వచ్చింది వేను వెంటనే అతన్ని రాత్రికి రాత్రి  కేర్ బంజారా హాస్పిటల్ కు తీసుకెళ్ళడం జరిగింది అక్కడ       డాక్టర్స్ వెంటనే గుండె మార్పిడి ఆపరేషన్ చేయవలసి వస్తుందనే  అని డాక్టర్ సలహా మేరకు బెంగళూరు విక్టోరియా ముల్టీ స్పెషాలిటీ   హాస్పిటల్ కు ఫ్లయిట్ లో తీసుకెళ్ళడం జరిగింది ఇది అంతా క్షణల మీద జరిగిపోయింది .
తన మిత్రుని చూడాలనే తలంపుతో బయలు దేరిన మనోహర్ ఆక్సిడెంట్ కు గురై అపోలో బంజారాహిల్స్ హాస్పిటల్ లో కోమాలో ఉన్నాడు .
మనోహర్ ను చూడటానికి ఊరు, ఊరంతా కదిలింది అపోలో హాస్పిటల్ డాక్టర్స్ మరియు  సిబ్బంది చూడటానికి వచ్చిన జానన్ని చూసి ఆశ్చర్య పడి  పోయారు.  ఒక వి‌వి‌ఐ‌పి ని చూడటానికి వచ్చిన జనానికి మించి ఉన్నారు. మనోహర్ తండ్రితో డాక్టర్ సంప్రదించి నీ  కొడుకు ‘’బ్రైన్ డెడ్ మేము చేసేది ఏమి లేదు’’  మనోహర్ తండ్రి వీరన్నకు నోటి వెంట మాట రాలేదు . ఒక్క క్షణం ఆలోచించాడు మనోహార్ ఎప్పుడు తనతో అంటూ ఉండేవాడు ‘’ నాన్న చని పోయిన తరువాత శరీరాన్ని మట్టిలో కలిపి చదలకు పెట్టె కంటే అవయవాలను దానం చేయడం ద్వారా – ఇంకా కొంత కాలము ఇతరులను  బ్రతికించి, మనము  బ్రతకవచ్చు ‘’ ఈ మాటలు జ్ఞాపకం వచ్చి డాక్టర్ తో – తన ఫ్రెండ్ బాలరాజు బెంగళూరులో ని  హాస్పిటల్ లో  గుండె మార్పిడి చికిత్స కోసం జాయిన్ అయ్యి  చికిస్తా పొందుతున్నాడు  అతనికి నా కొడుకు గుండెను – ఇవ్వండి నా కొడుకును అతనిలో చూసుకుంటాను నాకు సంతృప్తి ఉంటుంది నా కొడుకు ఆశయం నెరవేరుతుంది.

అనుకున్నదే తడువుగా డాక్టర్లు  మనోహర్ అవయవాలను రెండు  కిడ్నీ లను  గుండె , కాలేయం , ఊపిరి తిత్తులు అన్నింటిని వేరు చేయడానికి మొదలు పెట్టినారు . మూడు గంటల పాటు ఎనిమిది మంది వ్యైద్యులు శ్రమించి వాటిని వేరు చేయడం జరిగింది గుండెను తగిన జాగ్రత్తల నడుమ కస్టోడియల్ సొల్యూషన్ లో ఉంచి రిట్రైవల్ బాక్స్ లో బద్ర పర్చి  బెంగళూరులోని తన ఫ్రెండ్ బలరాజుకు ఇట్టి  గుండెను చేరవేయడానికై , హైదరాబాద్ – బెంగళూర్  పోలీసు కమిషనర్స్ తో మాట్లాడము  జరిగింది. వారు రహదారులను ట్రాఫిక్ ఫ్రీగా చేయడానికై అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీసుల ప్రత్యేక చొరవతో గ్రీన్ చానల్ ను ఏర్పాటు చేయడం జరిగింది . క్షణాల్లో రహదారులు నిర్మానుష మైయ్యాయి . ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తతతోఆంబ్యులెన్స్ లో  గుండెను శంషాబాద్  ఎయిర్ పోర్ట్ కు చేర్చి అక్కడ నుండి ఫ్లైయిట్  లో   బెంగళూరు హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఎయిర్ పోర్ట్ కు చేర్చడం జరిగింది.  అప్పటికే సిద్దంగా బెంగళూరు పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయటంతో మనోహర్ హృదయాన్ని – బాలరాజు చికిత్స పొందుతున్న విక్టోరియా హాస్పిటల్ కు 10 ని: షల  వ్యవదిలోనే ఆంబ్యులెన్స్ ద్వారా  చేర్చడం జరిగింది. మనోహర్ హృదయం    బాలరాజును చేరుకోడానికి ఎంత ఆతృత చెందిందో, తన మిత్రుని శరీరంలో ఒదిగి పోగానే అంతా సంతృప్తిని చెందింది.  మిత్రుని బ్రతికించుకోవడానికి తాను పడిన ఆరాటం నెరవేరింది. 


కామెంట్‌లు