*దీపావళి కాంతులు*;- మిట్టపల్లి పరశురాములు
చీకటివెలుగుల రంగేళి!
జీవితమే ఒక దీపావళి!!
తారజువ్వజిగెలుమనగ
మెరిసి మురిసే మానవాళి!!

నరకుడు చచ్చిన వేళ!
విముక్తి పొందిన వేళ!!
జనము నేడు నిర్భయముగ
ఊపిరి పీల్చుకునె వేళ!!!

మిలమిల మెరిసె దీపాలు!
విలసిల్లె దీపకాంతులు!
అవియెమానవులకుచెలిమి
 పంచిపెట్టెనుహారతులు!!

నవ్వులలోగిళ్లలోన!
పువ్వులు విరిసెనువాసన!
విరులమధ్యపాపనిలిచి
నవ్వులుపూయించెచాన!!
                ***

కామెంట్‌లు