పూల దారులు - బాల గేయం -- ఎం. వి. ఉమాదేవి.నెల్లూరు
పూల దారులు నీలి దారులు 
వేల వేల పసందు దారులు!

మంచిమాటలు ఎంచుబాటలు 
కంచికెళ్ళే కథల ఊటలు! 

అమ్మ ప్రేమలు అమితఘనతలు 
మనను కాచే మహాజ్యోతులు!

మల్లెతీగలు మంచి మనసులు 
దైవమిచ్చిన కొన్నిమమతలు!

చిన్నచేతలు గొప్పమోతలు 
వద్దు వద్దవి సొంత డప్పులు!


కామెంట్‌లు