పెద్దలు శ్రీ కెఎల్వీ సర్ రచించిన చిలక పలుకులు పేరు వినగానే అది వారి మనవరాలు ఆన్షీకి ఇచ్చిన బహుమతి కాబట్టి చిన్నపిల్లల పలుకులు మాత్రమే ఉదహరించి ఉంటాయనే ఊహతో పుస్తకం తెరిచిన తరువాత కానీ నాకు బోధపడలేదు. అవి చిలకపలుకులు కాదని, నిత్యజీవితంలో అందరినీ తట్టిలేపే ఙ్ఞాపకముద్రలని. శిశువు పలికే అ, ఆ నుంచి వాతావరణ సమస్యలైనటువంటి అకాల వర్షాల వరకు, జన్మధినంనుంచి జన బాంధవ్యాలైన పిలుపుల వరకు అన్నిటినీ సృశించిన ఒక అధ్భుత నిఘంటువు ఈ పుస్తకం. చిన్నారికిచ్చే బహుమతులన్నీ ఒక ఎత్తు అయితే ఇలాంటి దీర్ఘకాలిక గుర్తులుగా ఆచ్చే బహుమతులు మరో ఎత్తు. మరో తరానికీ బదిలీ అయ్యే తీపిగుర్తు. కనుమరుగైపోతున్న ఉత్తరాలనే కాక ఒకనాడు తీపి,చేదు వార్తలను మోసుకొచ్చే పోష్ట్ మేన్ వరకు వివరంగా విశదీకరించిన పుస్తకమిది. మనిషి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపే ప్లాస్టిక్ నుంచి, ప్రపంచాన్ని అతలాకుతులం చేసిన కరోనా మహమ్మారి వరకు ప్రతి విషయాన్ని వివరంగా వివరించేందుకు రచయిత గారు శ్రమ మాత్రమే కాక, ఆసక్తిని కూడ అందులో పొందుపరచారని ఆ కధలే చెపుతున్నాయి. అలాగే చిన్నారికి వచ్చే పంటి విషయాలు విషయం స్వతహాగ దంత దన్వంతరి అయిన వారి కలంనుంచి తప్పించుకుంటుందని నేను ఆశించలేదు. అలాగే గోదావరిలోని కొబ్బరి గురించి వ్రాసిన రచన నిజంగా కొబ్బరి రుచి తెలియని వారెవరూ లేకున్నా రచయితగారి వర్ణన అప్పుడే కొబ్బరిని రుచి చూడాలనిపించేలా నోరు ఊరిస్తుంది. ఇక వంగపండు గారి పేరడీ పుస్తకానికే మంచి ఆకర్షణ. సరసిగారి అధ్భుత ముఖచిత్రంగురించి ఎంతవివరించినా తక్కువే. వారి చిత్రంగురించి వివరించే స్థాయికూడ కాదు నాది.
కొన్ని పుస్తకాలు చదవడానికిమాత్రమే ఉపయోగపడేవి. కానీ ఈ పుస్తకం చదివి దాచుకుని భవిష్యతరానికి కూడ వివరించే అసలైన బాష్యంగా ఉపకరిస్తుందనడంలో సందేహమే లేదు. మంచి రచనను అందించిన పెద్దలు ప్రసాద్ సర్ గారికి,అభినందనలు తొలి పలుకు గా వ్రాసిన మొలక పలుకైన వేదాంతం సూరి గారికి ధన్యవాదములు. ఇక చిత్రకారులు సరసిగారికి శతకోటి నమస్కారాలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి