పద్యాలు ; -సాయి రమణి

 1)కవన కిరణ కాంతుల కమనీయ
సుమధుర రమణీయ యజ్ఞ ప్రభల
లలిత లావణ్య నవ్య మనోహర బాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2)విశేష విజ్ఞాన వినయ వికాస
సుందర సౌజన్య నవ్య వినూత్న
అల్లిక కూర్పుల అమృత సమాన భాష
వినరా బి

డ్డా!మన తెలుగు వైభవం!

3)అనంత వసుధ వైభవంబు
కిరణ కాంతుల సమాన
జ్ఞాన కిరీట జానపదుల భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

కామెంట్‌లు