తమిళ గాయకుడు టిఎమ్మెస్ గురించి ఈరోజు ఇంకొన్ని ముచ్చట్లు.....
15. టిఎమ్మెస్ స్వరపరచి పాడిన భక్తి పాట "కర్పగవల్లి నిన్ పొర్పాదంగళ్ పిడిత్తేన్...." పాటలో ఒక్కొక్క చరణంలోనూ ప్రత్యేకించి ఓ రాగం పేరు ఉంటుంది. ఆ రాగంలోనే ఆయన పాట పాడి సంగీతాన్ని సమకూర్చడం విశేషం.
16 చెన్నై న్యూ ఉడ్ ల్యాండ్స్ హోటల్ లో సర్వర్ గా పని చేసినతను కుళందైవేలన్. అతను నుదుట కుంకుమ, విభూతి, పరిశుభ్రమైన వస్త్రధారణతో సత్ప్రవర్తన కలిగిన మనిషని తెలుసుకున్న టిఎమ్మెస్ అతను ఉంటున్న గదికి వెళ్ళారు. ఓ నోట్ పుస్తకంలో తాను రాసుకున్న భక్తిపాటలనుటిఎమ్మెస్ కి చూపించారు. వాటిలో ఓ పాట టిఎమ్మెస్ కి ఎంతో ఇష్టం. ఆ పాటకు టిఎమ్మెస్ సంగీతం స్వరపరచి పాడారు. ఆ పాట సూపర్ హిట్టయింది. ఆ పాటే "ఉనై పాడుం తొయిలిన్డ్రి వేరు ఇల్లయ్"
17. అడిమైప్పెన్ సినిమా సమయంలో టిఎమ్మెస్ కుమార్తెకు పెళ్ళి. ఈ సినిమాకు సంబంధించిన పాటను పాడి వెళ్ళవలసిందేనని ఎంజిఆర్ పట్టుపట్టారు. అయితే టీడీపీ ఎమ్మెస్ తన కూతురు పెళ్ళే ముఖ్యమని, సినిమా కాదని వెళ్ళిపోయారు. అప్పుడా పాటను అప్పుడప్పుడే తమిళ సినిమాకు పరిచయమైన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో పాడించారు. ఆ పాటే "ఆయిరం నిలవే వా...." అనే పాట.
18. కుమార్తె వివాహమైన తర్వాత తనకు మళ్ళీ పాడాలని ఎంజిఆర్ టిఎమ్మెస్ ని కోరారు. టిఎమ్మెస్ కోపాన్ని బాధను మరచి మళ్ళా ఎంజిఆర్ కు పాడటం కొనసాగించారు.
19. అడిమైప్పెన్ సినిమా వరకూ టిఎమ్మెస్ ఒక్కో పాటకు తీసుకున్న సొమ్ము అయిదు వందల రూపాయలు. ఆ తర్వాత కనీసం వెయ్యి రూపాయలైనా ఇవ్వాల్సిందేనని పట్టుపట్టి తీసుకోవడం మొదలుపెట్టారు టిఎమ్మెస్.
20. టిఎమ్మెస్ ఒక్క టేక్ లోనే చక్కగా స్పష్టంగా తన వంతు పాట పాడినప్పటికీ ఇతర గాయకులూ గాయనీమణుల ఉచ్చారణలో పొరపాట్లు దొర్లడమో లేక వాయించే వారిలో ఎవరో ఒకరు పొరపాటు చేయడం వల్లో ఆ కాలంలో ఒకే పాటను మళ్ళీ మళ్ళీ పాడ ల్సి వచ్చేది.పది పన్నెండు టేకులైనా అయ్యేదట. కానీ టిఎమ్మెస్ ఒక్కో పాటకు ముందనుకున్న డబ్బే తీసుకునేవారు తప్ప టేకులెక్కువ య్యాయని అదనంగా డబ్బులు తీసుకునేవారు కాదు.
21. సిందనై సెయ్ మనమే....అనే పాటలో రెండో చరణంగా మొదలయ్యే "వడివేలుం మయిలుం తునై....నుంచి చివరి వరకూ గుక్క తిప్పుకోకుండా పాడి టిఎమ్మెస్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
22. ఎంజిఆర్, శివాజీకి మాత్రమే కాక జైశంకర్, రవిచంద్రన్, నాగేష్ తదితరులకు పాడవలసి వచ్చినప్పుడు వారికి తగినట్లు గొంతు మార్చి పాడేవారు టిఎమ్మెస్.
23. ఎంజిఆర్ కి టిఎమ్మెస్ పాడిన మొట్టమొదటి పాట - " ఎత్తనై కాలం దాన్ ఏమాట్రువార్ ఇంద నాట్టిలే....." ఈ పాట మలైకళ్ళన్ అనే సినిమాలోది.
24. నిజానికి అంతకుముందే ఎంజిఆర్ నటించిన మంత్రి కుమారి సినిమాలో టిఎమ్మెస్ ఓ పాట పాడారు. అయితే ఆ పాట ఎంజిఆర్ కి పాడింది కాదు. అన్నం ఇట్ట వీట్టిలే కన్నక్కోల్ సాత్తవా...అనే పాటను టిఎమ్మెస్ మరొక నటుడికి పాడారు. పైగా స్క్రీన్ మీద టిఎమ్మెస్ పేరు కనిపించదు. అలాగే పల్లాండు వాయ్గ సినిమాలో పుదియదోర్ ఉలగం సెయ్వోం
అనే భారతిదాసన్ పాటను టిఎమ్మెస్ పాడారు. ఈ పాటకు సంబంధించి కూడా టిఎమ్మెస్ పేరు స్క్రీన్ మీద కనిపించదు.
25. అన్నం ఇట్ట వీట్టిలే....పాట మొదటిసారిగా ప్రసారం చేసింది శ్రీలంక రేడియో. ఈ పాటను ప్రశంసిస్తూ మొదటి ఉత్తరం శ్రీలంక నుంచే టిఎమ్మెస్ కు అందింది. ఆయనకు మొట్టమొదటి ప్రశంసా లేఖను రాసినవారు శ్రీలంక తమిళుడే.
26. మలయాళ సినిమా రాగ సంగమం సినిమాలో కిశోర్ సంగీతదర్శకత్వంలో టిఎమ్మెస్ ఓ పాట పాడారు.
27 వంటావార్పులో టిఎమ్మెస్ కి మంచి పేరే ఉంది. సమమంటూ దొరికితే ఆయన ఇష్టపడి చేసే పని వంట. ఆయన చారు ఎంతో రుచికరంగా ఉంటుందని కుటుంబసభ్యులు అంటుండేవారు. చారు ఘుమఘుమలు ఇల్లంతా వచ్చేదట.
28. ఏదైనా కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు బంగారు ఆభరణాలు ధరించి వెళ్ళడమంటే టిఎమ్మెస్ కు ఇష్టమెక్కువ. లేకుంటే ఒక్కరూ పట్టించుకోకపోగా పాపం టిఎమ్మెస్ కి ఏం కష్టమొచ్చిందో అనుకుంటారని ఆయన ఫీలింగు. అందుకని ఈ పటాటోపం తప్పలేదనేవారు టిఎమ్మెస్. అందుకే ఇంటికి రావడంతోనే ధరించిన ఆభరణొలను తీసేసేవారు.
29. శాండో చిన్నప్ప దేవర్ కి టిఎమ్మెస్ అంటే మహాభిమనం. ఎంజిఆర్ తో ఎక్కువ సినిమాలు తీశారు చిన్నప్ప దేవర్. నల్ల నేరం అనే సినిమా సమయంలో టిఎమ్మెస్ మీది కోపంతో ఆయనతో కాకుండా మరెవరితోనైనా పాడించమని ఎంజిఆర్ చెప్పగా అలాగైతే తానీ సినిమానే తీయబోనని చిన్నప్ప దేవర్ గట్టిగా చెప్పారు.
ఆ మాటకు ఎంజిఆర్ విస్తుపోయారట. దాంతో ఎంజిఆర్ తన పంతాన్ని వీడారట.
నల్ల నేరం సినిమాలో టిఎమ్మెస్ పాడిన అన్ని పాటలూ సూపర్ హిట్.
30. జయభేరి అనే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుకి టిఎమ్మెస్ ఒక పాట పాడారు. "దైవం నీ వేనా.....ధర్మం నీ వేనా....అనే పాటది! ఇది క్లైమాక్స్ సాంగ్. ఈ పాటను హైపిచ్ లో పాడవలసి వచ్చింది. గాయకుడు ఘంటసాల, సంగీత దర్శకుడు పెండ్యాలతో "ఈ పాట పాడటం నావల్ల కాదు. టిఎమ్మెస్ తో పాడించుకోండి. అద్భుతంగా పాడుతారు" అని చెప్పారట. అయితే తమిళం తప్ప ఇతర భాషా చిత్రాలలో పాడటానికి ఇష్టపడని టిఎమ్మెస్ ని బలవంతంగా పాడించారు. ఎంజిఆర్, శివాజీ, జైశంకర్ తదితరులకు పాడిన గొంతుతో కాకుండా భిన్నమైన స్వరంలో అక్కినేని నాగేశ్వరరావుకి పాడారు టిఎమ్మెస్.
31. కవి వాలిని సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చింది టిఎమ్మెస్సే. అంతేకాదు, వాలిని ఎంజిఆర్ తదితర సినీ ప్రముఖుల వద్దకు తీసుకువెళ్ళి పరిచయం చేసింది టిఎమ్మెస్సే. ఆయనతో పాటలు రాయించుకోమని చెప్పిందికూడా టిఎమ్మేస్సే. అందుకే వాలి "నేనీ రోజు అన్నం తినడానికి కారణం టీడీపీ ఎమ్మెస్సే" అని అంటుండేవారు.
32. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న కథ అనే తెలుగు సినిమాలో టిఎమ్మెస్ ఓ పాట పాడారు. ఈ సినిమాలోనే ఎస్పీబీ మొదటిసారిగా ఓ పాట పాడారు. ఎస్పీబీ పాడాని ఆ చరణాలను రాసింది వీటూరి. వీటూరి నాకు బాబాయ్ అవుతారు.
35. శివాజీకి తనకు ప్రముఖ గాయకుడు సి.ఎస్. జయరామన్ తో పాడాలని పంతంగా ఉండేవారు. కానీ సిఎస్ జయరామన్ తనకు డబ్బులు ఎక్కువ కావాలని డిమాండ్ చేశారు. దాంతో నిర్మాత, దర్శకులు కలిసి ఆ సినిమాలో పాటలన్నీ టిఎమ్మెస్ తో పాడించారు. ఆ పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. శివాజీకి ఎంతో ఆనందమేసింది. అప్పటి నుంచి శివాజీకి టిఎమ్మెస్ పాడటం ఆరంభమైంది. ఆ సినిమా పేరు "తూక్కు తూక్కి"
36. తూక్కు తూక్కి సినిమాకు ముందే శివాజీకి కొంజుం కిళియాన పెన్నై గూండుకిళి ఆక్కివిట్టు.....అనే పాటను పాడారు టిఎమ్మెస్. ఎంజిఆర్, శివాజీ కలిసి నటించిన ఒకేఒక సినిమా గూండుకిళిలోదే ఈ పాట. అందులో పాట విన్న ఎంజిఆర్ తాను నటించిన మలైకళ్ళన్ సినిమాలో తనకు టిఎమ్మెస్సే పాడాలని కోరుకున్నారు.
37 ఎన్నో ప్రేమగీతాలను ఆలపించిన టిఎమ్మెస్ జీవితంలోనూ ఓ ప్రేమ కథ ఉంది. ఆ ప్రేమలో ఆయన ఓటమి చవిచూశారు. టిఎమ్మెస్ ధనలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించారు. అమ్మాయి వాళ్ళు కాస్తంత ఉన్నవాళ్ళు. కనుక పేదరికంతో మగ్గుతున్న కుటుంబానికి చెందిన టిఎమ్మెస్ కు తమ అమ్మాయిని ఇవ్వడానికి అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించారు. అందుకే సినిమాలలో ప్రేమలో ఓడిన వారి పాత్ర కోసం పాడవలసి వచ్చినప్పుడల్లా ఆ ధనలక్ష్మే తనకు కనిపిస్తోందని చెప్పుకునే వారట టిఎమ్మెస్.
38. తమిళ సినిమాలో కవయిత్రి రోషనారా బేగం ఒకే ఒక్క పాట రాశారు. ఆ తర్వాత మరే సినిమాలోనూ ఆమె పాటలు రాయలేదు. "కుంగుమ పొట్టిన్ మంగళం....అని రోషనారా బేగం రాసిన ఆ పాటను పాడింది టిఎమ్మెస్సే.
(సశేషం)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి