నీకు అర్థమవుతుంది !?ప్రతాప్ కౌటిళ్యా (కె ప్రతాప్ రెడ్డి)
నీకు అర్థమవుతుంది
నీ కాళ్లు చేతులు లాక్కున్నప్పుడు
నీ గుండె శ్వాసను ఆపేసి నప్పుడు
నీకు అర్థమవుతుంది!?


ముందు చూపును ముందుగానే బంధించినప్పుడు 
పంజరాల ను తయారు చేసి 
స్వర్గానికి దారి చూపినప్పుడు
నీకు అర్థమవుతుంది!?


ఆసక్తి ఆత్మహత్య చేసుకొని 
అసహ్యం నిన్ను అసహ్యించుకుని
హాస్యం మార్గం గుండా నీ వెళ్తున్నప్పుడు
ఏనుగులు దారికి అడ్డంగా నిలబడ్డప్పుడు
నీకు అర్థమవుతుంది!?


దశలు అన్నీ దాటుకుంటూ 
నాలుగు దిక్కులా నడిరోడ్డుపై
ఏ దిక్కు కెళ్ళిన నా దారి కనిపించినప్పుడు 
నీకు అర్థమవుతుంది!?


గొంతు నులమకుండా కుండలోని 
నీళ్లు నీకు అందకుండా చేసినప్పుడు 
కళ్ల నీళ్లు గడ్డకట్టించి నీ దారికి అడ్డంగా 
మంచు పర్వతాలు సృష్టించిన అప్పుడు
నీకు అర్థమవుతుంది!?


పిండాలు పెట్టి కాకుల్ని పిలిచినట్లు 
నీకు ఆకలి వేసినప్పుడు
 లోకమంతా ఇంత పిండం పెట్టి
వాళ్ల కండలు పెంచుకున్న అప్పుడు
నీకు అర్థమవుతుంది!?

నిన్ను అవమానించరు ఆహ్వానించరు
అసలు నీ ఉనికిని గుర్తించరు
గుడ్డి వాని చేసి గుడి ముందల కూర్చోబెట్టి 
నిన్ను అడుక్కుతినమన్నప్పుడు
నీకు అర్థమవుతుంది!?

గాలి కనిపించదు శత్రువు కనిపించడు
కానీ నీ శవం మాత్రం గాలిలో కలిసి పోతున్నప్పుడు
గుండెలో మంటలు మండుతున్నప్పుడు డు
మీకు అర్థమవుతుంది!?

కాల్చే అగ్ని శరీరం బయట కాదు లోపల కాలుతున్నప్పుడు
నగ్నంగా నీవొక్కడివే నిలబడ్డప్పుడు
శుద్ర పూజలు జరిపి చేతబడులు పేరుతో
నీ పేరును ఊరేగించినప్పుడు
నీకు అర్థమవుతుంది!?

నీ తల తీసి ఊరి ముఖ ద్వారం దగ్గర వేలాడేసి
నీకు ముఖమే లేకుండా చేసి ఇ నిన్ను ఉరి తీసినప్పుడు
నీకు అర్థమవుతుంది!?

యుద్ధం నాలుగు ముద్దుల కోసమే జరిగిందని
శరీర ముద్దల శవ పరీక్షలు చేసినప్పుడు
నీకు అర్థమవుతుంది!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు