వచ్చింది వచ్చింది దీపావళి
తెచ్చింది ఊరంత శోభావళి
దీపాలు వెలిగించి మహిళామణి
తిమిరాలు తరిమేసె బాలామణి
విష్ణు చక్రం తిరిగి
గిరగిరా కాంతులు
భూమి ముద్దాడినవి
భూ చక్రం కిరణాలు
సరదాగా తిప్పేటి చాంతాళ్లు
చిటపటా చిందులే చిచ్చుబుడ్లు
పాముబిళ్ల నుండి పామోయి
వెన్నముద్దలు వెన్నెలయ్యాయి
లక్ష్మి అవుట్లు చెవులకే గళ్ళు
తుపాకీ రీలుతో ఢమఢమలు
ఆకాశ చువ్వలు పెద్దోళ్ళకే
జాగ్రత్త గా కాల్చు టపాస్ లు
నూలు దుస్తులతో కాల్చాలి
సిల్క్ నైలాన్లు వదలాలి
తాతయ్య చెవుల్లో దూదిపెట్టు
ఢాంఢాంలు గుండెలదిరేట్టు!!
కాల్చిన కమ్ములు మూలెయ్యి
జాగ్రత్తగా తీసి పారెయ్యి
మందుగుండు వద్ద నిప్పువద్దు
నోటిలో చేతులు పెట్టుకోవద్దు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి