ఆంధ్రదేశంలో ఆబాలగోపాలాన్ని ఆనందింపజేసి, అన్ని కళారూపాలతో పాటు దీర్ఘకాలం దివ్యంగా వర్ధిల్లిన కళారూపం తోలుబొమ్మలాట.
బొమ్మలతో చక్కగా నాట్యం చేయిస్తారు. ఆపైన వెనుకనుంచి సూత్రధారుడు ఎంతో చాకచక్యంగా పాత్రాభినయం చేయిస్తూ ఉంటాడు. నాటక ప్రదర్శనానికి ఎన్ని హంగులు ఉండాలో దాదాపు అన్ని హంగులు బొమ్మలాట లోను ఉండాలి. ఇన్ని హంగులు ని వారు ఎక్కడ నుంచి పూర్తి చేసుకుంటారు. కిరాయి నటీనటుల్ని ఎక్కడనుంచి దించరు. జట్టు పెద్దలు పురుష పాత్రలు, వారి స్త్రీలు స్త్రీ పాత్రలు వహిస్తారు. భర్త శ్రీరాముడిగా వాచికం చెప్పి పాట పాడితే, భార్య సీతగా వాచికం చెప్పి వంత పాడుతుంది. వారి బిడ్డలు బాల బాలికలు పాత్రలకు అభినయం ఇస్తారు.
ఈ విధంగా గా ఆయా పాత్రల బొమ్మలు పుచ్చుకొని ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా నడుపుతారు. తెరమీది బొమ్మలు ఎంత ఉధృతంగా నాట్యం తొక్కుతూ ఉంటాయో, లోపలి భాగంలో ఉన్న వ్యక్తులు కూడా అంతటి అభినయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆనాటి తోలుబొమ్మలాటలు ఎంతో ఆదరణ నిలిచాయి. జనాలలో మంచి పేరు నిలుపుకున్నాయి. ఈనాడు మరుగున పడిపోయి తోలుబొమ్మలాట లంటే ఏమిటో తెలియని రోజులు వచ్చాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి