శ్రీ కాశీ విశ్వనాధ;-* ఎం. వి. ఉమాదేవి
పరమేశ్వరా ఈశ
ఈశాన్య బృహుధీశ
బృహుధీశ్వరా పాహి శరణమ్ము కోరె ఉమ!

కైలాస గిరినాథ 
గిరిజా పతీ ప్రమథ 
ప్రమథగణ సేవితా  మాం పాహి శివ శరణు!

నిర్గుణా నిశ్చలా 
నిశ్చల తపస్విలా 
తపస్వి మనోహరా తమోగుణ నివారణ!

రుద్రనేత్రాయ హర
హరహరా బ్రోవరా 
బ్రోవగా భక్తులను లాలింపరా శివా!

అర్ధ నారీశ ప్రభు 
ప్రభాస పుండ్ర విభు 
విభూతి శంకరాయ విశ్వేశ్వరా నమో!


కామెంట్‌లు