ప్రేమ లేఖ-రాధ కుసుమ-కలం స్నేహం
ఎన్నాళ్ళు అయిందో నిన్ను చూసి
మానసములో నిను బంధీగా చేసుకుని చూస్తున్నానే గానీ
ఎదురుగా నీ పలకరింపులు కుశల సమాచారాలు లేక ఖిన్నురాలైతిని...

నాపై కోపంతో దూరమై పోయినా నీ క్షేమాన్ని
కాంక్షిస్తూ నిలచిపోయా
వేదనతో అనుక్షణం నీ
ఆలోచనల బంధాల
అనురాగినిగా....

ఎప్పటికైనా నా ప్రేమ పిలుపు నీ వలపు తలుపు తట్టకమానదు

నీ హృదయం గడియ తీయక మానదు
అందుకే నిరిక్షించితి
నిను వీడని నీడనై...

ఎన్నో అవమానాల పరంపరలు నాపై
నీవు లిఖించినా
మమకారంతో మరచి
నీ వెంటే నేనున్నా
నీవు చూస్తున్నా చూడనట్లు నటించే నీ చూపులనే చూస్తూ అంతరంగంలో ఎంతో
బాధితనై...

కావాలని చేసే అవమానం కారణం తెలియక నా సంఘర్షణ
కాలమే పరిష్కారం చూపుతుందన్న ఆశతో
నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్న ధైర్యంతో నీవు కుశలంగా
ఉండాలని తలుస్తూ నీ
అనురాగం తిరిగి పొందాలని ఆశిస్తున్నా...!!

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
అంతర మథనo అనుకుంటా ను...