నీ ఆలోచనలే అగ్నిపర్వతాలై నిరంతరం నాలో రగులుతుంటే....!
నా మనసు, నీ జ్ఞాపకాల
గాఢాంధకారంలో కూరుకుపోతుంటే ....!!
నా కళ్ళలోని కన్నీరు కడలివలే ఉప్పొగుంతుంటే ...!
కారు చీకట్లను చీల్చుకుని,
మౌనంలో కూరుకుపోయిన నా మదిని పలకరించింది,...
మూగబోయిన నా జీవిత ప్రయాణానికి, తన మాటలను జతచేసింది...
ఎన్నో ఆలోచనలతో పరిభ్రమిస్తున్న నా మనసును తట్టిలేపింది...
అశ్రుధారలతో నిండిపోయిన నా చెక్కిలిని ప్రేమతో నిమిరింది...
ఒంటరి జీవనాన్ని కొనసాగిస్తున్న నన్ను, తన సహచర్యంతో మేల్కొలిపింది...
మమతకు ప్రతిరూపంగా మారిన తను, నాలో ఆనందపు అంచులను సృజింప జేసింది...
నాలో కరుడుకట్టుకుపోయిన కటినత్వాన్ని ధ్వంసం చేసి.
నాలో అడుగంటుకుపోయిన ప్రేమజలాన్ని తన మమతతో ప్రవహింపజేసి నా మనసును మళ్ళీ బతికించింది..
మనసు అంతరంగం ;-జోషి మైత్రేయి-కలం స్నేహం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి