అజ్ఞానమనే ముళ్ల బాటన నిను నడువనీయక
విజ్ఞానమే పూల బాట కి తన వేలినే ఊతగా ఇచ్చి...
ఉన్నత లక్ష్యాల వైపు నడిపించే
కార్య సాధకుడు గురువు...!!!
ఒక మట్టిముద్దని తనదైన శైలి లో
మాణిక్యం గా మలచి
మురిసిపోయే
శ్రామికుడు గురువు....!!!
అక్షరమనే దీపాన్ని వెలిగించి
ఆ వెలుగులో జ్ఞానం,సంస్కారం,
విచక్షణ, గౌరవం,మంచితనం,
మర్యాదల లాంటి ఎన్నో దారులని
చూపించే మార్గ దర్శకుడు గురువు...!!!
తర తరాల మన సంస్కతిని
ఈ నాటికీ మన కళ్ళకు గట్టినట్టు చెప్పి,
మన మేధస్సును దినదినాభివృద్ధిగావించే
త్యాగ శీలి గురువు...!!!
విజ్ఞానాన్ని ఇవ్వడానికి మాత్రమే తన జన్మ అంటూ..
..తను కరిగిపోతూ అందరికీ వెలుగు ను పంచే
కొవ్వొత్తి లా తనకున్న జ్ఞానాన్ని
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి