మన పుట్టుక గిట్టుటకు మనం కారకులం కాదు. కానీ మనపూర్వజన్మ సంచిత ప్రారబ్ధకర్మలు కారణం అని పెద్దలు అంటారు. గౌతమి అనే ఆమె కొడుకు పాము కాటుతో చనిపోతే ఆమె గుండె బద్దలు అయ్యేలా ఏడవసాగింది.ఒక వేటగాడు ఆకాటువేసిన పాము ని బంధించి "అమ్మా!దీన్ని ఇప్పుడే నీముందే చంపేస్తాను.నీకొడుకుచావుకి ప్ర తీకారంతీర్చుకో"అన్నాడు."బాబూ!నీవు నాకొడుకు ని బతుకించడం అసాధ్యం!పాము ని చంపితే ఏంలాభం?ఇంకా పాపం మూటకట్టుకుంటాను.దాన్ని విడిచి పెట్టు"అంది.
"అమ్మా!ప్రజలకు కీడు అపకారం చేసే పాముని చంపటం పాపంకాదు.చెడుని నాశనం చేసి తీరాల్సిందే!"అప్పుడు ఆపాము వలవలా ఏడుస్తూ ఇలా అంది"నాకు ఆపిల్లా డి పట్ల ఎలాంటి ద్వేషం లేదు.మృత్యుదేవత ఆదేశంప్రకారం కాటేశాను.నన్ను చంపకు" మృత్యుదేవత ఇలాఅంది"నేను ఏమాత్రం దోషిని కాదు. ఈసర్వసృష్టి అంతా కాలుడి ఆధీనంలో ఉంది. ఆయన పంపితేనే నేను వచ్చాను.ఇంతలో కాలుడు వచ్చి ఇలా అన్నాడు "నేనేమాత్రం దోషిని కాదు. ఓహోహో!అంతా కలిసి నాపై నిందారోపణ చేస్తున్నారు. అసలు జీవులంతా వారి కర్మలకు తగ్గ సుఖదుఃఖాలు కష్టసుఖాలు అనుభవించితీరాలి.వారు చేసేపనులు తప్పించుకోటం ఎవరికీ సాధ్యంకాదు.ఆకలి నిద్ర ఎంత సహజమో కర్మను అనుభవించటం కూడా అంతే సహజం! ఇందులో ఎవరి తప్పు దోషంలేదు. అన్నిటికీ కర్మయే కారణం!" గౌతమి ఎంత అందంగా తన భావాలు చెప్పిందో?"ఓవేటగాడా! నేను చేసినకర్మయే నన్ను పుత్ర శోకంలో ముంచెత్తినది.కర్మకు కుల మత జాతి వర్ణ వర్గ ధనిక దరిద్రభేదాలులేవు.పాము నిర్దోషి. దాన్ని విడిచి పెట్టు."మృత్యుదేవత కాలుడుఆమె మాటలను మన్నించి వెళ్లి పోయారు. మనజీవితాలు మన కర్మకు తగ్గట్టు నడుస్తాయి.జనన మరణాలు మన కర్మ ఫలితాలు. కాబట్టి హమేషాదైవస్మరణ చేస్తూ మన పనులు నీతిన్యాయంగా ఒక రికి కీడు తలపెట్టకుండా చేయాలి. కలియుగములో పుట్టడం నిజంగా మన అదృష్టం సుమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి