అమ్మ ప్రేమలో అమృత మొలుకు
నాన్న ప్రేమలో తేనెలొలుకు
అమృత ధారలు అంతటి చిలుకు
తేనె బిందువులు చిందు నంతట
అమ్మ మన అందరికి ఆది దేవత
నాన్న మనకెపుడు న్యాయదేవత
తొలి దైవానికి వందనాలు చేసి
న్యాయమూర్తి నీడలో నడుస్తాము
అమ్మ నాన్నలు మా రెండు కళ్ళు
కంటిలో నలత పడకుండ చూస్తూ
కంటికి రెప్పలా కాపాడుకుంటాము
ఆ కంటిచూపె మా బ్రతుకు దారులు
అమ్మా నాన్నలు ఇరువురు
మా ఇంట మాకు ఇలవేల్పులు
వారి చల్లని ఆశీస్సులు సధావేలలో
ఆయురారోగ్యాల సిరి సంపదలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి