కవిత్వం;-కమలాదేవి;-కలంస్నేహం
 :'కవయతీతి కవిః,తస్య కర్మ
కావ్యం'
వర్ణించేవాడు కవి
అతని పనే ,రచనే కావ్యం
అదే కవిత్వం
అక్షరాల సముదాయం
భావాల సమాహారం
ఆలోచనల సంపుటి
ఆవేదనల  సంగ్రహం
హృదయంతో పయనించి
మేధస్సు తో యోచించి 
బయటకు వెలువరించే
భావప్రకటనలే కవిత్వం
అనర్హమైన వస్తువంటూ లేదు 
కవిత్వానికి
చెట్టు,పుట్ట, రాయి,రప్ప
గాలి,నీరు ,నేల, నిప్పు 
అన్నీ కవితా వస్తువులే
వాడిగల,వేడిగల కలమే
కవి ఆయుధం
నిరూపిస్తాడు కవి
కత్తి కంటె కలం గొప్పదని
సమాజ సంస్కరణకు
ఉపయోగిస్తాడు తన ఆయుధాన్ని కవి
కవిత్వం ఒక చైతన్య స్రవంతి 
ప్రవహింప చేస్తాడు కవి
తన రచనల ద్వారా
ఉత్తేజాన్ని,ఉల్లాసాన్ని , ఉత్సాహాన్ని 
కలిగిస్తుంది కవిత్వం
ఆనందాన్ని, ఆహ్లాదాన్ని 
అందిస్తుంది కవిత్వం
హృదయభారాన్ని తగ్గిస్తుంది 
ఊరట కలిగిస్తుంది 
శ్రమను మరపింపచేస్తుంది
కవిత్వం 
సృష్టికి ప్రతి సృష్టి చేయగల
కవిబ్రహ్మలు
సమసమాజ స్థాపనకు 
దురాచారాల నిర్మూలనకు
సంఘ సంస్కరణకు
సహకరించేది కవిత్వమే

కామెంట్‌లు
Unknown చెప్పారు…
You are like a magician in using appropriate words in proper places. Wonderful.