పద్యాలు ; - సాయి రమణి
1.సప్త స్వరాల శబ్ద విన్యాస
పల్లవి రాగాల వీణ వాయిద్య
తరంగ గమన నవనీత తెలుగు భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2. దివ్య ప్రభాత సూర్య తేజస్సు
సుధా వర్ష సోముని సౌమ్యత
నిమిడీకృత తపోనిధి తెలుగు భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

3. దివ్వెల కాంతి తేజంబు
అల్లికల లావణ్య మధురంబు
అమృత తత్వ ప్రభోద ద్రావిడ భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

 

కామెంట్‌లు