గ్రంధాలయాలు వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయాల గురించి తెలుసుకుందాం.; తాటి కోల పద్మావతి గుంటూరు.

 ఒక కవి గాని రచయితగానే తన భావాన్ని శాస్త్ర పురాణాలను పద్యంలో గాని గద్యం లో లో గాని రచించిన పుస్తకం గ్రంథం అంటారు. ఈ గ్రంథాలు సేకరించి భద్రపరిచే ప్రదేశమే గ్రంథాలయాలు. దీనికి కొత్తగా భాండాగారము అని కూడా అంటారు. గ్రంధాలయాలు సరస్వతి దేవి పూజా మందిరాలు గ్రంథాలయాధికారి ఆలయంలో పూజారి వంటివాడు.
గ్రంథం విజ్ఞానదాయకం. ప్రజలకు జ్ఞాన నేత్రాన్ని తెరిపించే సాధనం . పుస్తకంపై అభిలాష ఉన్న ప్రతి వ్యక్తి అన్ని పుస్తకాలను కొన్ని చదవలేడు కాబట్టి పాఠకులకు అవసరమైన మంచి గ్రంథాలను ఒక చోట భద్రపరుస్తారు. ఈ గ్రంథాలయాలను అతి ప్రాచీన కాలం నుండి ఇ నెలకొల్పినట్లు మనకు సాక్ష్యాలు ఉన్నాయి. నలంద, తక్షశిల నాగార్జునకొండ వంటి ప్రదేశాలలో గొప్ప గ్రంథాలయాలు ఉండేవి. తంజావూరు ను పాలించిన శరభోజి మహారాజు సరస్వతీ మహల్ అనే అపూర్వమైన గ్రంథాలయాన్ని తంజావూరులో నెలకొల్పారు. ఇందులో వివిధ భాషల ముద్రిత అముద్రిత గ్రంథాలు ఉన్నాయి.
సాధారణంగా గ్రంధాలయాలు పరిశోధన గ్రంధాలయాలు అని రెండు రకాలు. విశ్వవిద్యాలయాల్లోని గ్రంధాలయాలు పరిశోధన గ్రంధాలయాలు. ప్రతి గ్రామంలో నగరంలో సామాన్య పాఠకులకు ఉపయోగించే గ్రంథాలతో ఏర్పరిచే వాటిని సామాన్య గ్రంధాలయాల అంటారు. వీటిని జిల్లా గ్రంథాలయం సంస్థ వారు, మునిసిపాలిటీ వారు ఏర్పాటు చేస్తుంటారు. ప్రభుత్వాలు ప్రాంతీయ గ్రంథాలయాలను కేంద్ర గ్రంథాలయాలలో నిర్వహిస్తాయి.
రెండు ఆలయంలో పాఠకుల సంఘాలు ఏర్పరచాలి. వారికి కావలసిన పుస్తకాల వివరాలు తెలుసుకుని చెప్పించాలి. వేటపాలెం , పోడూరు గ్రంధాలయాలు అలాంటివి. రాజమండ్రిలోనే గౌతమీ గ్రంధాలయం కూడా ఉన్నది. ఒక మంచి పుస్తకం చదివితే ఆ పాటకు నీ మనసు మరి అతడు ఒక గాంధీ గా
 ఒక నెహ్రూ గా కాగలదా అవకాశం ఉంది. శ్రావణణుని పితృభక్తి కథ చదివినా బాల గాంధీ మన దేశానికి జాతిపిత అయ్యాడు. ఒకసారి చదివి పారవేయదగిన పుస్తకాలను కాక, శాశ్వత నిధి గా దాచుకోదగ్గ గ్రంథాలను సేకరించాలి . విద్యావంతులైన ప్రజలు కల దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది
కామెంట్‌లు